Vladimir Putin: యూకే నూతన ప్రధానిగా నియమితులైన రిషి సునాక్‌కు ప్రపంచ దేశాల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. కానీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం శుభాకాంక్షలు చెప్పకుండా దూరంగా ఉన్నారు. రిషిని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎందుకు అభినందించలేదన్న దానిపై ఆ దేశ అధ్యక్ష భవనం స్పందించింది. బ్రిటన్ ఇప్పుడు రష్యా విరోధి దేశాల జాబితాలో ఉందని.. అందుకే శుభాకాంక్షలు తెలియజేయలేదని పుతిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు. సునాక్ నేతృత్వంలోని బ్రిటన్‌తో రష్యా సంబంధాలు మెరుగయ్యే అవకాశాలేమీ కనిపించడం లేదని పెస్కోవ్ అన్నారు. మరోవైపు ప్రధానిగా ఎన్నిక కాగానే రిషి సునాక్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి ఫోన్ చేసి మద్దతు ప్రకటించారు.
Shivaji on Currency Note: కరెన్సీ నోటుపై శివాజీ?.. మహారాష్ట్ర నాయకుడి చమత్కారం
యూకే ప్రధానిగా రిషి సునాక్ నియమితులు కావడం పట్ల అమెరికా, భారత్, చైనాలు సహా పలు దేశాలు స్పందించి రిషి సునాక్‌ను అభినందించాయి. ప్రపంచ సమస్యలపై బ్రిటన్ కొత్త ప్రధానితో కలిసి పనిచేస్తామని భారత ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. సునాక్‌కు అభినందనలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. అమెరికా, బ్రిటన్, భారత్ వంటి ప్రజాస్వామ్య దేశాల్లోనే ఇలాంటి ఎంపికలకు అవకాశం ఉందని అన్నారు. బ్రిటన్ కొత్త ప్రధాని హయాంలో ఆ దేశంతో సంబంధాలు మరింత ముందుకెళ్లాలని భావిస్తున్నట్లు చైనా విదేశాంగ శాఖ తెలిపింది.