Indigo Flight: ఇండిగో ఫ్లైట్ ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెనుప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indigo Flight: ఢిల్లీ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. బెంగళూరుకు వెళ్లాల్సిన ఇండిగో విమానం ఇంజిన్‌లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో విమానాశ్రయంలోనే విమానాన్ని నిలిపివేశారు. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో జరిగింది. ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవుతున్న సమయంలో ఇంజిన్‌లో మంటలు చెలరేగినట్లు పైలెట్లు, సిబ్బంది గుర్తించారు. వెంటనే విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించి అత్యవసరంగా నిలిపివేశారు. సమస్యను గుర్తించి వెంటనే విమానాన్ని నిలిపివేసి ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఆ సమయంలో విమానంలో 184 మంది ఉన్నారు. 177 మంది ప్రయాణికులు కాగా.. ఏడుగురు సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది.
Shiva Statue: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుడి విగ్రహం.. నేడే ప్రారంభం
Also Read
ఇండిగో విమానం 6E-2131లోని ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఎయిర్‌బస్ ఏ-320 విమానంలో 184 మంది ఉన్నారు. ప్రయాణీకులలో ఒకరైన ప్రియాంక కుమార్, ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు, ఇందులో ఒక ఇంజిన్‌లో మంటలు చెలరేగడం కనిపిస్తుంది. రాత్రి 9:45 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో ప్రయాణికులను వెంటనే బయటకు తీసుకురాలేదు. ప్రయాణికులను రాత్రి 11 గంటల తర్వాత విమానం నుంచి దిగి అర్ధరాత్రి సమయంలో మరో విమానంలో తరలించారు. దీనిపై ఇండిగో స్పందిస్తూ.. ప్రయాణీకులకు కలిగించిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నామని తెలిపింది. టేకాఫ్ రోల్ సమయంలో సాంకేతిక లోపంతో విమానం ఇంజిన్లో మంటలు చెలరేగినట్లు తెలిపింది.
#BREAKING #IndiGo flight 6E-2131 (Delhi to Bangalore) grounded at Delhi airport after a suspected spark in the aircraft | Watch @Atul_Bhatia80 pic.twitter.com/IwwRfdACQq
— shashwat bhandari (@shashbhandari) October 28, 2022
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!