Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు వింత అనుభవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rishi Sunak: రోగులను పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు వింత అనుభవం ఎదురైంది. రిషి సునాక్ శుక్రవారం సౌత్ లండన్‌లోని క్రొయిడన్ యూనివర్సిటీ ఆస్పత్రిని సందర్శించారు. ఈ నేపథ్యంలో ఓ మహిళా రోగిని పరామర్శిస్తూ.. ఇక్కడ ఆస్పత్రి సిబ్బంది ఎలా చూసుకుంటున్నారని ఆమెను ప్రశ్నించారు. ఆమె దానికి సమాధానం చెబుతూ.. బాగా చూసుకుంటున్నారని బదులిస్తూనే.. ఆసుపత్రి సిబ్బందికి ప్రభుత్వం చాలా తక్కువ వేతనాలు ఇస్తోందని, వాటిని చూస్తుంటే జాలేస్తోందని అన్నారు. నర్సుల వేతనాలు పెంచాలని కోరారు. ఆ దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పేలోపే.. ఆమె కల్పించుకుని ప్రయత్నించడం కాదని.. మరింత తీవ్రంగా ప్రయత్నించాల్సిన అవసరముందని అనడంతో ఆశ్చర్యపోయిన సునాక్.. తప్పకుండా అని బదులిచ్చారు.
America: ఘోరం.. ఒకే ఇంట్లో 8 మృతదేహాలు.. అసలేం జరిగింది?
Also Read
- ICC T20 Rankings: ఆఫ్ఘనిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసినా ఉపయోగం లేకపాయే.. నంబర్ 1 స్థానం ఫసక్..!
- TMC Crisis: టీఎంసీకి కొత్త పేర్లు, గుర్తులు.. మమతకు ‘‘ఫుట్‌బాల్ ప్లేయర్’’, రిటబ్రతకు ‘‘ఎన్వలప్ కవర్’’..
- SIPB: విశాఖపట్నంలో ఉపాధి అవకాశాలు.. దిగ్గజ సంస్థల ఏర్పాటుకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్..
- Gurugram: వామ్మో ఇదేం జాడ్యం.. హిట్ అండ్ రన్ కేసులో నిందితుడికి మద్దతుగా కార్ల ర్యాలీ
తమ జీతాలను పెంచాలని డిమాండ్ చేస్తూ ఇటీవల దాదాపు 3 లక్షల మంది నర్సింగ్ సిబ్బంది సమ్మెకు దిగాలని సిబ్బంది నిర్ణయించారు. దీనికోసం ఓటింగ్ కూడా నిర్వహించారు. సమ్మెకు వెళ్లేందుకు ఓటింగ్ నిర్వహించడం ఈ శతాబ్ద కాలంలో బ్రిటన్‌లో ఇదే తొలిసారి. పెరిగిపోతున్న ధరలకు తోడు, ఉద్యోగంలో చేరినప్పటి నుంచి వేతనాల్లో పెరుగుదల లేదని, అందుకే ఓటింగ్ నిర్వహించాల్సి వచ్చిందని రాయల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తెలిపింది. జాతీయ వైద్య సేవల కింద బ్రిటన్‌లో 1948 నుంచి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వ సేవలకు కేటాయించిన బడ్జెట్‌లో మూడింట ఒక వంతును ఆరోగ్య సేవల కోసమే ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.
తాజావార్తలు
-
ICC T20 Rankings: ఆఫ్ఘనిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసినా ఉపయోగం లేకపాయే.. నంబర్ 1 స్థానం ఫసక్..!
-
TMC Crisis: టీఎంసీకి కొత్త పేర్లు, గుర్తులు.. మమతకు ‘‘ఫుట్‌బాల్ ప్లేయర్’’, రిటబ్రతకు ‘‘ఎన్వలప్ కవర్’’..
-
Suhas: తెలుగు ఆడియన్స్ అనే పదమే రావట్లేదా సుహాస్?
-
KFC పార్కింగ్‌లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
-
SIPB: విశాఖపట్నంలో ఉపాధి అవకాశాలు.. దిగ్గజ సంస్థల ఏర్పాటుకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..