T20 World Cup: అడ్డంకిగా మారిన వరుణుడు.. ఐర్లాండ్‌తో అఫ్గాన్ మ్యాచ్ రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup: ఆస్ట్రేలియాలో టీ-20 ప్రపంచకప్ టోర్నమెంట్‌కు వరుణుడు అడ్డంకిగా మారాడు. సూపర్-12 పోరులో భాగంగా అఫ్గాన్, ఐర్లాండ్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ రద్దైంది. అఫ్గాన్ జట్టుకు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఇదే పరిస్థితి ఎదురుకావడం గమనార్హం. సూపర్-12 పోటీల్లో అఫ్గాన్ ఆడాల్సిన రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు అయ్యాయి. మెల్‌బోర్న్ వేదికగా అఫ్గానిస్థాన్, ఐర్లాండ్ మ్యాచ్‌ను వర్షం కారణంగా రద్దు చేసినట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది. అంతకు ముందు న్యూజిలాండ్‌తో ఆడాల్సిన మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దు అయింది.
Amit Shah: ‘ఇక ఆపండి’.. హర్యానా హోంమంత్రిని సున్నితంగా మందలించిన అమిత్ షా
Also Read
ప్రస్తుతం గ్రూప్-1లో అఫ్గానిస్థాన్ జట్టు మూడు మ్యాచ్‌ల్లో 2 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. ఇందులో ఒక మ్యాచ్‌లో ఓటమి ఎదురురాగా.. మరో రెండు మ్యాచ్‌లు రద్దయ్యాయి. ఇక ఐర్లాండ్ ఒక విజయం, ఒక ఓటమి, ఒక రద్దుతో మూడు పాయింట్లు సాధించి రెండో స్థానంలో కొనసాగుతోంది. అఫ్గానిస్థాన్‌కు శ్రీలంక, ఆస్ట్రేలియా వంటి గట్టి జట్లతో మ్యాచ్‌లు మిగిలి ఉండగా.. ఐర్లాండ్ కూడా ఆసీస్, న్యూజిలాండ్ టీమ్‌లతో తలుపడాల్సి ఉంది.
తాజావార్తలు
-
BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
-
Astrology: అక్టోబర్ 02 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అంతా శుభమే..!
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?