Ilaiyaraaja: ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు షాక్.. కాపీరైట్ వివాదంలో మాస్ట్రోకు ఎదురుదెబ్బ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దశాబ్దాలుగా తన స్వరాలతో సినీ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న సంగీత జ్ఞాని ఇళయరాజాకు న్యాయస్థానంలో ఊహించని పరిణామం ఎదురైంది. తన కంపోజిషన్లపై పూర్తి అధికారం తనదేనని ఆయన చేస్తున్న పోరాటంలో భాగంగా, ఢిల్లీ హైకోర్టు తాజాగా ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు చర్చనీయాంశంగా మారాయి.
Also Read : Abhishek Bachchan: కొత్త హెయిర్ స్టైల్ వెనుక అసలు రహస్యం ఇదే!
Also Read
- Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
- IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
- Off The Record: ఖైరతాబాద్‌లో పొలిటికల్ తలరాతలు తిరగబడే ముప్పు ముంచుకొస్తుందా..?
సంగీత హక్కుల విషయంలో ప్రముఖ ఆడియో సంస్థ ‘సరిగమ’,ఇళయరాజా మధ్య జరుగుతున్న వివాదంలో న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. 1976 నుంచి 2001 మధ్య కాలంలో ఇళయరాజా బాణీలు అందించిన 134 చిత్రాలకు సంబంధించిన ఆడియో హక్కులు సదరు సంస్థకే చెందుతాయని కోర్టు స్పష్టం చేసింది. నాటి చిత్ర నిర్మాతలు ఈ హక్కులను శాశ్వత ప్రాతిపదికన సరిగమకు విక్రయించిన నేపథ్యంలో, ఇప్పుడు వాటిపై ఇళయరాజాకు ఎలాంటి యాజమాన్య హక్కులు ఉండవని జస్టిస్ తుషార్ రావు గెడేలా వెల్లడించారు.
నిజానికి, ఈ పాటలను వివిధ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్స్‌లో వాడుకోవడానికి ఇళయరాజా ఈ మధ్యే అనుమతులు ఇవ్వగా, దానిని సరిగమ సంస్థ సవాల్ చేసింది. కాపీరైట్ చట్టం ప్రకారం.. నిర్మాత వద్ద వేతనం తీసుకుని కంపోజ్ చేసిన పాటలపై హక్కులు నిర్మాతకే ఉంటాయని , ఆయన ద్వారా ఆ హక్కులు పొందిన సంస్థకే పూర్తి అధికారం ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది. ‘ఎప్ ఇనియా పొన్ నిలవే’ వంటి ఆల్ టైమ్ హిట్ సాంగ్ వివాదంలో మొదలైన ఈ చట్టపరమైన పోరాటం,ప్రస్తుతానికి ఇళయరాజాకు ప్రతికూలంగా మారింది. అయితే దీనిపై ఆయనపై కోర్టులో అప్పీలు చేసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?