America: అమెరికాలోని ఒక్లహామా రాష్ట్రం బ్రోకెన్ యారో పట్టణంలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. మంటల్లో తగలబడిపోతున్న ఇంట్లో 8 మృతదేహాలు లభ్యమయ్యాయి. వారిలో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. మంటల్లో ఇల్లు కాలి బూడిద అవుతుండడంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనుమానాస్పద స్థితిలో విగత జీవులుగా కనిపించగా.. ఇంట్లో ఉన్న పెద్దలు.. మొదట పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్నారా? లేదా వీరందరినీ ఇంకెవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఇంటికి నిప్పు పెట్టారా? అన్న విషయాలపై దర్యాప్తు చేస్తున్నట్లు బ్రోకెన్ యారో పోలీస్ చీఫ్ బ్రాండన్ బెర్రీహిల్ తెలిపారు.
New Bike: ఓరి నీ ఏషాలో.. కొత్త బైక్ కొంటే ఇంత రచ్చ చేయాలా..?
చనిపోయిన చిన్నారులు 1 నుంచి 13 ఏళ్లలోపు వారేనని పేర్కొన్నారు. అగ్ని ప్రమాదం కారణంగా వీరు చనిపోయినట్టు కనిపించడం లేదని అగ్నిమాపక అధికారులు తెలిపారు. ఆ ఇంట్లో నుంచి పోలీసులు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. కాగా, స్థానిక మహిళ ఒకరు మాట్లాడుతూ.. తాను కారులో వెళ్తున్న సమయంలో ఆ ఇంటి నుంచి దట్టమైన పొగలు రావడం కనిపించిందని అన్నారు. ఆ సమయంలో సృహలో లేని ఓ మహిళను ఓ వ్యక్తి ఈడ్చుకెళ్లడం కనిపించిందని పేర్కొన్నారు.