Pistols Seized: కొన్ని సినిమాల్లో విలన్ల నుంచి తప్పించుకోవడానికి హీరోలు వాహనంపై దూసుకుపోతుంటే.. ఛేజ్ చేసే సన్నివేశాలు ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేస్తాయి. తుపాకులను రవాణా చేస్తున్న వాహనాన్ని నాటకీయ ఫక్కీలో పోలీసులు పట్టుకున్న సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు సుదీర్ఘంగా వెంబడించిన తర్వాత కారులో 40తుపాకులు, 36 మ్యాగజైన్‌లతో సహా అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు మంగళవారం ఒక అధికారి తెలిపారు.
సోమవారం తెల్లవారుజామున ఇండోర్‌లోని రౌ ప్రాంతంలో ఆగ్రా-ముంబయి జాతీయ రహదారిపై హర్యానా రిజిస్టర్డ్ కారును పోలీసులు అడ్డుకున్నారని పోలీసు కమిషనర్ హరినారాయణచారి మిశ్రా విలేకరులకు తెలిపారు. పోలీసులను తప్పించే క్రమంలో డ్రైవర్ కారు వేగాన్ని పెంచి పారిపోతుండగా పోలీసు వాహనాన్ని ఢీకొట్టాడని తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు ఇండోర్‌కు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖల్‌ఘాట్‌కు చేరుకున్నారు, అక్కడ వారు మళ్లీ అడ్డగించిన పోలీసు వాహనాన్ని ఢీకొట్టారు.
Nepal: నేపాల్ పార్లమెంటరీ ఎన్నికల్లో శతాధిక స్వాతంత్య్ర సమరయోధుడు.. ప్రచండపై పోటీ
పోలీసుల దిగ్బంధనం తర్వాత అంతర్ రాష్ట్ర ముఠా నిందితులు ఖర్గోన్ జిల్లాలోని సనావాడ్ ప్రాంతంలో కారును వదిలి దట్టమైన అడవి వైపు పారిపోయారని ఆయన చెప్పారు. హర్యానా రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్న వాహనం నుంచి 40 తుపాకులు, 36 మ్యాగజైన్లు, ఐదు కాట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నట్లు అధికారి తెలిపారు. నిందితుల కోసం అన్వేషణ ప్రారంభించామని, ఆయుధాల మూలాన్ని కనుగొనడానికి దర్యాప్తు ప్రారంభించామని అధికారి తెలిపారు.