PM Narendra Modi: మోర్బీ వంతెన కూలిన ప్రదేశాన్ని పరిశీలించిన ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Narendra Modi: గుజరాత్ మోర్బీ వంతెన కూలిన ఘటనపై యావత్ దేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. దాదాపు 135 మంది ప్రాణాలను బలిగొన్న మోర్బీ వంతెన దుర్ఘటన జరిగిన ప్రదేశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సందర్శించారు. మచ్చు నదిలో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఆదివారం మోర్బీ పట్టణంలోని మోర్బీ కేబుల్ వంతెన కూలిపోయి, ప్రజలు మచ్చు నదిలో మునిగిపోవడంతో మహిళలు, పిల్లలతో సహా కనీసం 135 మంది మరణించారు. 100 మందికి పైగా గాయాలకు చికిత్స పొందుతున్నారు. ఘటనాస్థలిని పరిశీలించిన అనంతరం ప్రధాని మోడీ మోర్బీలోని సివిల్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ప్రమాదంలో గాయపడినవారిని, బాధిత కుటుంబాలను పరామర్శించారు. అక్కడి నుంచి ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. ఈ ఘటన వివరాల గురించి ఆరా తీశారు. 26 మృతుల కుటుంబాలను ప్రధాని మోడీ పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Gujarat Tragedy: గుజరాత్ వంతెన దుర్ఘటన.. భారత్‌కు సంతాప సందేశం పంపిన జీ జిన్‌పింగ్
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
మోర్బీలో పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌లో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. మోర్బీలో దురదృష్టకర దుర్ఘటన జరిగినప్పటి నుండి జరుగుతున్న రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్ల గురించి ప్రధానికి అధికారులు వివరించారు. దుర్ఘటనకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చించారు. బాధిత వారికి అన్ని విధాలా సహాయం అందేలా చూడాలని ప్రధాని ఉద్ఘాటించారని పీఎంఓ ప్రకటన విడుదల చేసింది. అత్యున్నత స్థాయి సమావేశానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్, హోం మంత్రి హర్ష్ సంఘవి, గుజరాత్ చీఫ్ సెక్రటరీ, డీజీపీతో పాటు రాష్ట్ర హోం శాఖ, గుజరాత్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సహా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్లలో ఎలాంటి అలసత్వం ఉండదని ప్రధాని గతంలోనే చెప్పారు. వంతెన కూలిన ఘటనపై విచారణ జరిపేందుకు గుజరాత్ ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. మోర్బి బ్రిడ్జి కూలినందుకు ఒరేవా అధికారులు, వంతెనను పునరుద్ధరించిన సంస్థ, టిక్కెట్లు అమ్మేవారు, భద్రతా సిబ్బందితో సహా తొమ్మిది మందిని అరెస్టు చేశారు.
ఇదిలా ఉంటే ప్రధాని రాకకు ముందే ఈ వంతెన మరమ్మతులు చేసిన కంపెనీ పేరు కనిపించకుండా షీట్‌తో కవర్ చేశారు. దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో పేరుకుపోయిన సమస్యలపై దృష్టి పెట్టారు. రాత్రికి రాత్రే ఆసుపత్రి గోడలకు రంగులు వేయించడంతో పాటు అవసరమైన మరమ్మతులు చేపట్టారు. రాత్రిపూట మరమ్మతులు జరుగుతుండడంతో స్థానిక మీడియా అక్కడికి చేరుకుంది. రంగులు వేస్తున్న సిబ్బందిని, ఆసుపత్రిలో చేపట్టిన మరమ్మతులను ఫొటోలు తీసి ప్రసారం చేసింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోపక్క అర్ధరాత్రి ఆసుపత్రిలో మరమ్మతులు చేపట్టడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోషూట్ కోసం బీజేపీ బిజీబిజీగా ఏర్పాట్లు చేస్తోందని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల నేతలు విమర్శలు గుప్పించారు.
#WATCH | PM Modi along with Gujarat CM Bhupendra Patel visits the cable bridge collapse site in Morbi, Gujarat
135 people lost their lives in the tragic incident pic.twitter.com/pXJhV7aqyi
— ANI (@ANI) November 1, 2022
#WATCH | PM Modi meets the injured in the #MorbiBridgeCollapse incident that happened on October 30
(Source: DD) pic.twitter.com/26tXlAvnmJ
— ANI (@ANI) November 1, 2022
తాజావార్తలు
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!