“నేను దోషినే అయితే నన్నెందుకు ప్రశ్నిస్తున్నారు? మీకు వీలైతే వచ్చి నన్ను అరెస్టు చేయండి,” అని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ తనకు సమన్లు పంపడం ఒక గిరిజన ముఖ్యమంత్రిని వేధించే కుట్రలో భాగమని ఆయన ఆరోపించారు.
విశ్వవిద్యాలయాల వీసీల నియమకాల్లో గవర్నర్ జోక్యం చేసుకుంటున్నారన్న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వ్యాఖ్యలను ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ తీవ్రంగా ఖండించారు.
దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హరియాణా, యూపీ రైతులు పంట వ్యర్థాలను కాల్చేస్తుండటంతో ఆ పొగంతా ఢిల్లీని దట్టంగా కమ్మేస్తోంది. దీంతో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది.
ప్రేమ గుడ్డిదంటే ఒప్పుకోని కొందరు ఈ జంటను చూస్తే నిజమే అని ఒప్పుకోక తప్పదు. వయో వ్యత్యాసాన్ని కూడా పట్టించుకోకుండో ఆ జంట ప్రేమించుకుంది. పెళ్లికి వయసుతో సంబంధం లేదని నిరూపించింది ఆ జంట.