దేశంలో 6 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ఇవాళ ముగిసింది. గురవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 6 గంటల తర్వాత లైన్ నిల్చున్న వాళ్లకు ఓటేసేందుకు అనుమతించారు.
పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధ్యక్షుడు, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేపట్టిన ర్యాలీలో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. కాల్పులు జరిపిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ముగ్గురు ఆర్మీ జవాన్లను చంపిన సంచలనాత్మక 2000 ఎర్రకోట దాడి కేసులో తనకు మరణశిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాది మహ్మద్ ఆరిఫ్ అలియాస్ అష్ఫాక్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది.
విద్యార్థి తన జీవితాన్ని అంతం చేసుకునేందుకు తీవ్ర చర్యలు తీసుకుంటే ఉపాధ్యాయులను మాత్రమే నిందించకూడదని, వారి భవిష్యత్తును రూపొందించడంలో తల్లిదండ్రులు కూడా అంతే కీలక పాత్ర పోషిస్తారని మద్రాసు హైకోర్టు గురువారం వ్యాఖ్యానించింది.
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో డీజిల్‌తో నడిచే వాణిజ్య వాహనాలు, ట్రక్కులు నిషేధించబడ్డాయి. నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 450కి పడపోవడంతో వాహనాలను నిషేధించారు.
జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో సైన్యం చొరబాటు ప్రయత్నాన్ని భగ్నం చేసి ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చినట్లు అధికారులు తెలిపారు.
ఈ మధ్యం ఎక్కడ ఏ పని చేయించుకోవాలన్నా లంచం ఇవ్వాల్సిందే. ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో న్యాయంగా ఏదైనా పని చేయించుకోవాలంటే చెప్పులు అరిగేలా తిరగాల్సిందే. అదే లంచం ఇస్తే వెంటనే పని పూర్తయిపోతుంది. కొన్నిసార్లు అవినీతి అధికారులు ఏసీబీ అధికారులకు చిక్కుతుంటారు.
పాకిస్థాన్‌లో ర్యాలీలో ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై కాల్పులు జరపడంపై భారత్ స్పందించింది. పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. "ఈ ఘటన ఇప్పుడే జరిగింది.అక్కడి పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాం.’అని భారత విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ తెలిపారు.
ఇద్దరు మహిళలను హత్య చేసి, మార్చురీలలో శవాలను లైంగికంగా వేధించినందుకు బ్రిటన్‌లో పూర్తి జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆసుపత్రి ఎలక్ట్రీషియన్ గురువారం మరో 23 మంది చనిపోయిన మహిళలను అపవిత్రం చేసినట్లు అంగీకరించాడు.
రైలులోని టాయిలెట్‌లో చనిపోయిన ఓ వ్యక్తిని ఎవరూ గుర్తించకపోవడంతో మృతదేహంతోనే రైలు దాదాపు 900 కిలోమీటర్లు ప్రయాణించింది. చివరికి ఉత్తరప్రదేశ్ షాజహాన్‌పూర్‌లోని రోజా స్టేషన్‌లో మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. అమృత్‌సర్ వెళ్తున్న సహర్స-అమృతసర్ జన్‌సేవా ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన జరిగింది.