Delhi: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో డీజిల్‌తో నడిచే వాణిజ్య వాహనాలు, ట్రక్కులు నిషేధించబడ్డాయి. నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 450కి పడపోవడంతో వాహనాలను నిషేధించారు. నిత్యావసర వస్తువులను తీసుకువెళ్లే అన్ని వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు ఢిల్లీలో నడపడానికి అనుమతించబడతాయన్నారు. నిత్యావసర వస్తువులను రవాణా చేసే వాహనాలను తప్ప మధ్యస్థ, పెద్ద వాహనాలను కూడా రాజధాని లోపలికి అనుమతించరు. రాజధాని, పరిసర ప్రాంతాల్లో బీఎస్-4 డీజిల్ వాహనాలను కూడా నిషేధించారు. పాలు, డెయిరీ, మందులు, వైద్య వస్తువుల ఫ్యాక్టరీలకు మినహాయింపును పొడిగించారు. హైవేలు, రోడ్లు, ఫ్లై ఓవర్లు, ఓవర్‌బ్రిడ్జిలు, పవర్ ట్రాన్స్‌మిషన్, పైప్‌లైన్‌ల వంటి ప్రధాన ప్రాజెక్టుల నిర్మాణాలు నిలిచిపోయాయి.
ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో 50 శాతం మంది ఉద్యోగులను ఇంటి నుంచే పని చేసేలా అనుమతించాలని కేంద్రాన్ని కోరింది. పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలు, వాహనాలను బేసి-సరి ప్రాతిపదికన నడపడంపై నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరింది. జాతీయ రాజధాని ప్రాంతంలో గాలి నాణ్యత క్షీణిస్తూనే ఉన్నందున గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) కింద ఈ చర్యలను చేపట్టేందుకు సెంటర్స్ కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) సబ్‌కమిటీ అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. గాలి నాణ్యత అంచనాల ఆధారంగా తదుపరి తగిన చర్యలు తీసుకోవడానికి తదుపరి సమీక్ష సమావేశం నవంబర్ 6న నిర్వహించబడుతుంది.
Jammu Kashmir: కశ్మీర్‌లో చొరబాటు యత్నం భగ్నం.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హరియాణా, యూపీ రైతులు పంట వ్యర్థాలను కాల్చేస్తుండటంతో ఆ పొగంతా ఢిల్లీని దట్టంగా కమ్మేస్తోంది. దీంతో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచీ 400 మార్క్‌ను దాటింది. సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రీసెర్చ్ ప్రకార దేశరాజధాని ఢిల్లీలో తీవ్రస్థాయికి చేరగా.. ఏక్యూఐ 408గా నమోదైంది. ప్రస్తుతం యూపీలోని నోయిడాలో 393, హర్యానాలోని గురుగ్రామ్‌లో 318గా నమోదైంది. సెంట్రల్ ఢిల్లీలోని మందిర్ మార్గ్ వంటి కొన్నింటిని మినహాయించి రాజధానిలోని చాలా ప్రాంతాల్లో ఏక్యూఐ 300 కంటే ఎక్కువగా నమోదైంది.
పంజాబ్, హర్యానాలో గత రెండు నెలలను వ్యవసాయ వ్యర్థాలను కాల్చివేయడం వల్ల కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. వీటి నియంత్రించాలని ఢిల్లీ సర్కారు పొరుగు ప్రాంతాలను కోరుతున్నా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, నోయిడా వంటి ఢిల్లీకి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రాంతీయ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని యూపీ, హర్యానా ప్రభుత్వాలను ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్‌రాయ్ అభ్యర్థించారు. కాలుష్య సమస్యను అరికట్టాలంటే ఉమ్మడి సహకారం అవసరమని గోపాల్ రాయ్ పేర్కొన్నారు. కాలుష్యం తీవ్రతరం కావడంతో ఢిల్లీలో అన్ని నిర్మాణ పనులను, కూల్చివేతలను అధికారులు నిలిపివేయించారు. నిషేధ సమయంవో ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి నెలకు రూ.5వేలు అందించాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయించారు. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు కార్యకలాపాలపై ఆంక్షలు ఉంటాయని పేర్కొన్నారు. మరో వైపు గాలి నాణ్యత మెరుగయ్యే వరకు పాఠశాలలను మూసివేయాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఢిల్లీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది