Student M*urder: గదిలో యువతి మృతదేహం కలకలం.. దర్యాప్తులో సంచలన విషయాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Student Murder: మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరంలో సంచలనం రేపిన MBA విద్యార్థిని హత్య కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ద్వారకాపురి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో యువతిని హత్య చేసిన ఆమె ప్రేమికుడు పీయూష్‌ను ముంబైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం.. యువతిని హత్య చేసిన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయి ముంబై, పన్వేల్ ప్రాంతాల్లో దాక్కున్నాడు. సాంకేతిక ఆధారాల సహాయంతో అతని స్థానాన్ని గుర్తించిన పోలీసులు ప్రత్యేక బృందంతో వెళ్లి అరెస్ట్ చేశారు.
Star Actress : రూ. 500 నుండి రూ. 4 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే రేంజ్ కు స్టార్ హీరోయిన్
Also Read
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
నిందితుడు పీయూష్, మృతురాలు ఒకే విద్యాసంస్థలో చదువుతూ సన్నిహితంగా ఉన్నారు. నిందితుడు యువతిని వివాహం చేసుకోవాలని కోరగా.. ఆమె మాత్రం సంబంధాన్ని ముగించాలని భావించింది. ఈ విషయంపై ఇద్దరి మధ్య తరచూ వాగ్వాదాలు జరిగేవని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన రోజు మాట్లాడుకోవాలని చెప్పి యువతిని తన గదికి పిలిచిన నిందితుడు, ఆమె మొబైల్‌లో ఒక యాప్‌ను చూసి అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది.
ఫిబ్రవరి 13న గది నుంచి దుర్వాసన వస్తుండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని గదిలో నుంచి యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. డెడ్ బాడీ ఆధారంగా హత్య అనంతరం లైంగిక దాడి జరిగిన అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే ఫిబ్రవరి 12న యువతి గల్లంతైనట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అధికారులు తెలిపారు.
Mother Love: పేగు బంధం అంటే ఇదే కాబోలు.. తన దూడ చనిపోయిన చోటుకు అధికారులను తీసుకెళ్లిన ఆవు..
ఈ కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రారంభ విచారణలో నిందితుడు పొంతనలేని సమాచారాన్ని ఇస్తున్నాడని.. దర్యాప్తును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నట్లు అనుమానం వ్యక్తమవుతోందన్నారు. హత్య, అత్యాచారం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
-
Explainer: మరిన్ని విపత్తులు తప్పవా?
-
Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
JNTU Sultanpur : జేఎన్టీయూ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఇద్దరు సీనియర్లు సస్పెండ్
-
Student Protests: రేప్ నుంచి దెయ్యం వరకు.. పుకార్లతో రగిలిపోతున్న యూనివర్సిటీలు.!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!