Imran Khan: పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధ్యక్షుడు, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేపట్టిన ర్యాలీలో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. కాల్పులు జరిపిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్ ప్రావిన్స్‌లోని వజీరాబాద్‌లో ఇమ్రాన్‌ఖాన్ ప్రజలనుద్దేశించి మాట్లాడేందుకు కంటెయినర్‌పైకి ఎక్కిన సందర్భంలో నిందితుడు ఆయనపై కాల్పులు జరపడం తెలిసిందే. ఈ ఘటనలో ఇమ్రాన్‌ఖాన్ కుడి కాలికి గాయం కాగా.. మరికొందరు పీటీఐ నేతలకు కూడా గాయాలయ్యాయి. వీరందరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన క్రమంలో ఇమ్రాన్ ఖాన్‌పై కాల్పులకు పాల్పడిన దుండగుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇమ్రాన్‌ను హత్య చేసేందుకే తాను వచ్చానని, ఆయన ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నందుకే ఇలా చేశానని పేర్కొన్నాడు.
Supreme Court: 22 ఏళ్ల నాటి ఎర్రకోట దాడి కేసులో సుప్రీం సంచలన తీర్పు
ఇమ్రాన్‌ఖాన్‌ను మాత్రమే చంపాలనుకున్నానని, ఇంకెవరినీ కాదని దుండగుడు చెప్పాడు. ఇమ్రాన్ లాహోర్ దాటినప్పటి నుంచి పథకాన్ని పన్నినట్లు వివరించాడు. ఈ ఘటనలో ఇద్దరు కాల్పులు జరిపినట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో నిందితుడు స్పందిస్తూ.. తాను ఒక్కడినేనని.. తనతో ఇంకెవరూ లేరని సమాధానం ఇచ్చాడు.
حملہ آور کا بیان کردہ جواز ناقابل قبول ہے کسی شہری کو خود ہی عدالت بن کر کسی دوسرے کو سزا دینے کا کوئی اختیار نہیں ہے تمام سیاسی قائدین کو اس بڑھتی ہوئی انتہاپسندی کے خلاف مشترکہ حکمت عملی بنانے کی ضرورت ہے https://t.co/Vjr9Tdc497
— Hamid Mir حامد میر (@HamidMirPAK) November 3, 2022