Congress: కాంగ్రెస్, భారత్ జోడో యాత్ర ట్విటర్ ఖాతాలను నిలిపేయండి.. కోర్టు ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: కాంగ్రెస్ పార్టీకి బెంగళూరు కోర్టు షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్రలో కేజీఎఫ్-2 సినిమాలోని పాటలను ప్లే చేసినందుకు గాను ఒక సంగీత సంస్థ కాంగ్రెస్‌పై కాపీరైట్ కేసు దాఖలు చేయడంతో బెంగళూరు కోర్టు కాంగ్రెస్ ట్విటర్ హ్యాండిల్‌ను తాత్కాలికంగా బ్లాక్ చేయాలని ఆదేశించింది. భారత్ జోడో యాత్ర సమయంలో సూపర్‌హిట్ కన్నడ చిత్రం కేజీఎఫ్-2 నుంచి మ్యూజిక్‌ను ఉపయోగించారని ఆరోపిస్తూ ఆ సినిమాకు సంగీతాన్ని అందించిన ఎంఆర్‌టీ సంస్థ అధినేత ఎం.నవీన్‌కుమార్ రాహుల్‌గాంధీతో సహా ముగ్గురు కాంగ్రెస్ నాయకులపై ఫిర్యాదు చేశారు.
కాపీరైట్, ఐపీసీ నిబంధన కింద రాహుల్ గాంధీతోపాటు, జైరామ్ రమేశ్, సుప్రియపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. దీనిపై విచారణ చేపట్టిన బెంగళూరు కోర్టు ఈ మేరకు తీర్పు వెల్లడించింది. జోడో యాత్రకు సంబంధించి జైరామ్ రమేశ్ రెండు వీడియోలను తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారని.. ఎలాంటి అనుమతి తీసుకోకుండా అందులో కేజీఎఫ్-2 సంగీతాన్ని వినియోగించారని నవీన్ కుమార్ కేసు వేశారు. భారత్ జోడో యాత్ర ప్రచార వీడియోలలో కేజీఎఫ్-2 పాటలు ఉన్నాయని మ్యూజిక్ కంపెనీ మేనేజర్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో భారత్ జోడో యాత్ర ప్రచారానికి సంబంధించిన ట్విట్టర్ హ్యాండిల్‌ను తాత్కాలికంగా బ్లాక్ చేయాలని కోర్టు ఆదేశించింది.
Also Read
- Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
- DoT SIM Card Warning: మీ పేరు మీద సిమ్‌ను వేరొకరు వాడుతున్నారా? మీకు రూ.50 లక్షల వరకు జరిమానా!, పైగా శిక్ష..
- Faria: నేనింకా ఇల్లు కొనలేదు.. సందీప్ కిషన్ చెప్పాక కొనాలనుకున్నా.!
- Danam Nagender: సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నా.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ..!
Mehreen Pirzadaa: సముద్ర తీరాన సాగర కన్యలా దర్శనమిచ్చిందే
కోర్టు కార్యకలాపాల గురించి తమకు తెలియదని, ఆర్డర్ కాపీ తన వద్ద లేదని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ఐఎన్‌సీ, బీజేవైఎస్‌ఎం హ్యాండిల్స్‌కు వ్యతిరేకంగా బెంగళూరు కోర్టు నుండి ప్రతికూల ఆర్డర్ గురించి తాము సోషల్ మీడియాలో చదివామని కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర బీజేవై సోషల్ మీడియా హ్యాండిల్‌ను ప్రస్తావిస్తూ ట్వీట్ చేసింది.
We have read on social media about an adverse order from a Bengaluru court against INC & BJY SM handles.
We were neither made aware of nor present at court proceedings. No copy of the order has been received.
We are pursuing all the legal remedies at our disposal.
— Congress (@INCIndia) November 7, 2022
తాజావార్తలు
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
Turkey Earthquake: టర్కీలో భారీ భూకంపం.. 5.8 తీవ్రతతో కంపించిన భూమి
-
DoT SIM Card Warning: మీ పేరు మీద సిమ్‌ను వేరొకరు వాడుతున్నారా? మీకు రూ.50 లక్షల వరకు జరిమానా!, పైగా శిక్ష..
-
Faria: నేనింకా ఇల్లు కొనలేదు.. సందీప్ కిషన్ చెప్పాక కొనాలనుకున్నా.!
-
Danam Nagender: సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నా.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ..!
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్‌ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!