Ghulam Nabi Azad: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని కాంగ్రెస్ మాత్రమే సవాలు చేయగలదని, ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం ఢిల్లీకి చెందిన పార్టీ మాత్రమేనని కాంగ్రెస్ మాజీ నాయకుడు గులాం నబీ ఆజాద్ ఆదివారం అన్నారు. కాంగ్రెస్ పార్టీతో దశాబ్దాల అనుబంధాన్ని విడిచిపెట్టిన నెలల తర్వాత.. ఆజాద్ లౌకికవాద విధానానికి తాను వ్యతిరేకం కాదని, బలహీనమైన పార్టీ వ్యవస్థకు వ్యతిరేకం అని అన్నారు. ఆ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ మెరుగైన పనితీరును కనబరచాలని తాను కోరుకుంటున్నానన్నారు.
కాంగ్రెస్‌పై గులాం నబీ ఆజాద్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ హిందూ, ముస్లిం రైతులందరినీ ఎంతో కాలంగా ఏకం చేసిందన్నారు. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఏమీ చేయలేరన్నారు. వారు పంజాబ్‌లో విఫలమయ్యారని, పంజాబ్ ప్రజలు మళ్లీ ఆప్‌కు ఓట్లు వేయరని అన్నారు. ఆప్ కేవలం ఢిల్లీకి మాత్రమే చెందిన పార్టీ అని ఆయన ఆరోపించారు. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ మాత్రమే బీజేపీని సవాల్ చేయగలదన్న ఆయన.. ఎందుకంటే వారు అందరితో కలుపుకుపోయే విధానాన్ని కలిగి ఉన్నారన్నారు. జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించడంపై తాను ఈ సమస్యను చాలాసార్లు వారి దృష్టికి తీసుకెళ్లానన్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తే అది స్వాగతించదగిన చర్య అని అన్నారు.
Currency: పెద్ద నోట్ల రద్దుకు ఆరేళ్లు పూర్తి.. కానీ ప్రజల వద్ద డబ్బెంతో తెలుసా?
గులాం నబీ ఆజాద్ దోడా పర్యటనలో ఉన్నారు. అక్కడ ఆయన చాలా మంది ప్రతినిధులను కలవనున్నారు. రాబోయే రోజుల్లో అనేక ర్యాలీలలో ప్రసంగించనున్నారు. అంతకుముందు ఆగస్టు 26న గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీతో 52 ఏళ్ల అనుబంధాన్ని విడిచిపెట్టారు. అక్టోబర్‌లో ఆజాద్ తన కొత్త రాజకీయ సంస్థ ‘డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ’ని ప్రకటించిన సంగతి తెలిసిందే. సోనియా గాంధీకి తన రాజీనామా లేఖలో అతను గత తొమ్మిదేళ్లలో పార్టీని నడిపిన తీరుపై పార్టీ నాయకత్వాన్ని, ముఖ్యంగా రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు.