Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్ నోట అణు విస్పోటనాల మాట.. ఉక్రెయిన్‌కు ముప్పు తప్పదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vladimir Putin: ఉక్రెయిన్‌పై సైనిక చర్యను మరింత తీవ్రతరం చేసేందుకు రష్యా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఉక్రెయిన్‌పై రష్యా అణుదాడికి పాల్పడే అవకాశం ఉందన్న ఊహాగానాల నేపథ్యంలో అణ్వాయుధాల ప్రయోగంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా పుతిన్ ఫ్రాన్స్ దేశాధినేత ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ తో మాట్లాడుతూ, హిరోషిమా, నాగసాకి అణు విస్ఫోటనాల గురించి ప్రస్తావించారు. యుద్ధంలో గెలవాలంటే ఇలా ప్రధాన నగరాలపైనే దాడి చేయనక్కర్లేదు అంటూ ఎక్కడైనా అణుబాంబు వేయొచ్చన్న రీతిలో పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తరచుగా అణుయుద్ధం గురించి మాట్లాడుతున్నారు. తద్వారా ఆయన అగ్రరాజ్యం అమెరికా, పాశ్చాత్య దేశాలకు హెచ్చరికలు చేస్తున్నట్టే భావించాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్.. తాజాగా రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై అణు బాంబుల దాడి ఘటనను తెరపైకి తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. అయితే పుతిన్ మరోసారి అణుయుద్ధం గురించి మాట్లాడడం పాశ్చాత్యదేశాల అధినేతలను ఆందోళనకు గురిచేస్తోంది. ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకడానికి పుతిన్ వ్యూహాత్మక అణ్వాయుధాన్ని ఉపయోగించే అవకాశాలు ఉన్నాయని వారు కలవరపడుతున్నారు. కాగా, యూరప్ లో శీతాకాలం వస్తే మంచు పరిస్థితుల కారణంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరికొంతకాలం కొనసాగే అవకాశాలున్నాయి. వీలైనంత త్వరగా ఈ యుద్ధానికి ముగింపు పలకాని పుతిన్ భావిస్తే అణ్వస్త్ర ప్రయోగానికి దిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్నది అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Also Read
KA PAUL Sesational Comments: కేఏ పాల్ వేదాంతం.. కామెంట్స్ వైరల్
రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా జపాన్ నగరాలు హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా అణుబాంబులు వేసిన సంగతి తెలిసిందే. 1945 ఆగస్టు 6న హిరోషిమా పైనా, ఆగస్టు 9న నాగసాకిపైనా రెండు అణుబాంబులు ప్రయోగించింది. ఈ అణ్వస్త్ర ప్రయోగంతో జపాన్ లొంగిపోగా, రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. ఈ రెండు నగరాల్లో ఊహకందని నష్టం వాటిల్లింది.
తాజావార్తలు
-
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
-
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
-
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
-
Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
-
Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!