టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఇంగ్లాండ్‌తో సెమీ ఫైనల్ మ్యాచ్‌కు ముందు టీమిండియాను గాయాలు భయపెడుతున్నాయి. ప్రాక్టీస్ సెషన్‌లో భారత కీలక ఆటగాళ్లు గాయపడ్డారనే వార్తలు క్రికెట్ అభిమానులను కంగారుపెడుతున్నాయి.
గవర్నర్ ఆర్ఎన్ రవిని శాంతికి ముప్పు అని పేర్కొంటూ, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ప్రజలకు సేవ చేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ.. ఆయనను పదవి నుంచి తొలగించాలని కోరుతూ తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీ రాష్ట్రపతికి మెమోరాండం సమర్పించింది.
భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన భారత న్యాయవ్యవస్థకు 50వ అధిపతిగా నియమితులయ్యారు.
కరోనా అనే పేరు వినపడితేనే యావత్ ప్రపంచం వణికిపోయిన రోజులున్నాయి. ఎంతో మంది ఆత్మీయులను, ఆప్తులను పొట్టన పెట్టుకుని దేశంలో ఎన్నో కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చింది ఈ మహమ్మారి. ఇంకా ఇప్పటికీ కరోనా అంటే వణికిపోతున్నారు.
రమణ్‌సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు ప్రభుత్వ ఆధీనంలోని సివిల్ సప్లయ్ కార్పొరేషన్‌లో కుంభకోణం, చిట్ ఫండ్ సంస్థల అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ విచారణ జరిపించాలని చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు లేఖ రాశారు.
ఆర్థిక సంస్కరణలకు దేశం మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు రుణపడి ఉంటుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం అన్నారు. పేద ప్రజలకు దాని ప్రయోజనాలను అందించాలనే ఉద్దేశంతో భారతదేశానికి ఉదారవాద ఆర్థిక విధానం అవసరం అని గడ్కరీ టీఐఓఎల్ అవార్డ్స్ 2022 కార్యక్రమంలో మాట్లాడుతూ అన్నారు.
టీ20 ప్రపంచకప్‌లో కీలక సమరానికి ఆసన్నమైంది. ఈ టీ20 ప్రపంచకప్‌లో తొలి రౌండ్‌లో మొదలైన సంచలనాలు ‘సూపర్ 12’లో ముగియగా.. ఇక మేటి జట్ల మధ్య నాకౌట్ మెరుపులకు రంగం సిద్ధమైంది. బుధవారం జరిగే తొలి సెమీస్‌లో న్యూజిలాండ్ జట్టు పాకిస్థాన్‌ను ఢీకొంటోంది.
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి సీజేఐగా నియామకమైన జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
నేపాల్‌లో 6.6 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 6 మంది చనిపోయారు. నేపాల్‌లో భూకంపం సంభవించడంతో భారత రాజధాని ఢిల్లీ దాని పరిసర ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయి.
ఓ యువతి లింగమార్పిడి చేసుకుని యువకుడిలా మారింది. అనంతరం పెద్దల అనుమతితో మరో యువతిని పెళ్లిచేసుకుంది. ఈ ఘటన రాజస్థాన్‌లోని భరత్‌పుర్ జిల్లాలో జరిగింది.