Polish Leader: పోలండ్‌కు చెందిన అధికార పార్టీ నేత జరోస్లావ్ కాజిన్స్కీ యువతులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో జననాల రేటు పడిపోవడానికి కారణం యువతులు అధికంగా మద్యపానం చేయడమేనని పాలకపక్ష నాయకుడు జరోస్లావ్ కాజిన్స్కీ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో పోలండ్‌లో ఆగ్రహజ్వాలలు చెలరేగాయి. ప్రతిపక్ష నేతలు, మహిళా ప్రముఖులు ఆయనపై మండిపడుతున్నారు. ఈ వ్యాఖ్యలు పితృస్వామ్యానికి నిదర్శనమని అభిప్రాయపడ్డారు. ఆ వ్యాఖ్యలు అర్థం లేనివిగా కొట్టి పారేశారు.
25 ఏళ్ల వయసు వచ్చే వరకు మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో గమనిస్తే.. యువ మహిళలు తమ వయసు వారైన పురుషులతో సమానంగా మద్యాన్ని సేవిస్తున్నారు. అందుకే పిల్లలు కలగడం లేదని కాజిన్స్కీ అన్నారు. పురుషుడు మద్యానికి బానిసగా మారాలంటే అధికంగా 20 ఏళ్ల పాటు సేవించాల్సి ఉంటే.. మహిళలకు కేవలం రెండేళ్లు చాలని కూడా చెప్పారు. ఈ వ్యాఖ్యలను ఆయన సమర్థించుకోవడం గమనార్హం. ఓ డాక్టర్ అనుభవం ఆధారంగా చెబుతున్నట్లుగా కాజిన్స్కీ వెల్లడించారు. ఓ డాక్టర్ తన పురుష ఆల్కహాల్ బాధిత రోగుల్లో మూడింట ఒక వంతు మందిని సరిదిద్దగా.. మహిళల్లో ఒక్కరినీ బాగుచేయలేకపోయినట్టు చెప్పారు. పోలండ్ లో ఓ మహిళ సగటు జనన రేటు 1.3కు తగ్గిపోవడం అక్కడ ఆందోళన కలిగిస్తోంది. “ఒక స్త్రీ తల్లిగా పరిపక్వం చెందాలి” కాబట్టి చిన్న వయస్సులోనే స్త్రీలు పిల్లలను కనడానికి తాను అనుకూలంగా లేనని కాజిన్స్కీ జోడించారు. 25 సంవత్సరాల వయస్సు ఉన్న యువతులు మందు కొట్టినట్లయితే.. అది జనన రేటుకు మంచిది కాదన్నారు.
Crime in Hyderabad: రెండో భర్తతో భార్య.. పెట్రోల్ పోసి నిప్పంటిచిన మొదటి భర్త
వామపక్ష రాజకీయవేత్త జోవన్నా స్క్యూరింగ్-వీల్గస్ ఈ వ్యాఖ్యలను చెత్త అని కొట్టిపారేశారు. చట్టసభ సభ్యుడైన కాటర్జినా లుబ్‌నౌర్ ఈ వ్యాఖ్యలను ఉద్దేశించి మాట్లాడుతూ.. మహిళలను అవమానించే అర్ధంలేని మాటలుగా అభివర్ణించారు. పోలిష్ ఫుట్‌బాల్ స్టార్ రాబర్ట్ లెవాండోవ్స్కీ భార్య అన్నా కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వ్యాఖ్యలపై స్పందించారు. ఇక చాలు.. రాజకీయ నాయకులు అసలు సమస్యను గుర్తించకుండా మహిళలను అన్యాయంగా నిందిస్తే తనకు చాలా కోపం వస్తుందన్నారు. ఆర్థిక కారణాలతో పాటు పోలిష్ సర్కారు ప్రవేశపెట్టిన అబార్షన్ ఆంక్షలపై భయంతో పోలిష్ మహిళలు పిల్లలను కనడానికి వెనుకాడుతున్నారని విమర్శకులు వాదించారు.