Weddings: దేశంలో ఇప్పటికే పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. దసరా, దీపావళి బొనాంజా తర్వాత వ్యాపారులకు భారీ బొనాంజా తగలనుంది. దేశంలో ఈ నెల 4న మొదలైన పెళ్లిళ్ల సీజన్ వచ్చే నెల 14 వరకు కొనసాగుతుందని, ఈ సీజన్‌లో మొత్తంగా 32 లక్షల వివాహాలు జరిగే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) వెల్లడించింది. ఈ సందర్భంగా రూ. 3.75 లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని వెల్లడించింది. లక్షలాది జంటలను ఏకం చేసేందుకు మోగే బ్యాండ్ బాజాలు మార్కెట్ వర్గాలకు కొత్త శోభను తేనున్నట్లు తెలుస్తోంది. సీఏఐటీ సంస్థ రీసెర్చ్ విభాగం నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ విషయాలను అంచనా వేసింది.
ఈ సీజన్‌లో దాదాపు 32లక్షల వివాహాలు జరగనుండగా.. వాటి ద్వారా సుమారు రూ. 3.75లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని ఆ సంస్థ అంచనా వేసింంది. సర్వేలో భాగంగా దేశవ్యాప్తంగా 35 నగరాల్లోని 4,302 మంది వ్యాపారులు, సర్వీస్ ప్రొవైడర్ల నుంచి వివరాలను సేకరించింది. ఈ సీజన్‌లో ఒక్క ఢిల్లీలోనే 3.5 లక్షల వివాహాలు జరగనున్నట్టు సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ వెల్లడించారు. ఈ వివాహాల ద్వారా రూ.75 వేల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. గతేడాది ఇదే సీజన్‌లో దేశంలో 25 లక్షల వివాహాలు జరిగాయని, వాటి ద్వారా రూ. 3 లక్షల కోట్ల మేర వ్యాపారం జరిగిందని వివరించారు. ఈ సీజన్‌లో మార్కెట్‌లో మొత్తంగా 3.75 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరిగే అవకాశం ఉందన్నారు. ఈ సీజన్ ముగిశాక, జనవరి 14 నుంచి జులై వరకు మళ్లీ పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతుందని ఖండేల్వాల్ తెలిపారు.
Nota in Second Place: ఉపఎన్నికల్లో విచిత్రం.. నోటాదే రెండో స్థానం
పెళ్లిళ్ల సీజన్‌లో వ్యాపారం పుంజుకోవచ్చని.. దేశవ్యాప్తంగా వ్యాపారులు ఏర్పాటు మునుగుతున్నారు. ఎందుకంటే ఈ ఏడాది దీపావళి రికార్డు స్థాయిలో వ్యాపారం జరగగా… మరి పెళ్లిళ్లలో ఎంత మేరకు వ్యాపారం కానుందనే విషయాలపై అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ మొత్తంలో ఆదాయం ఆర్జించొచ్చని వ్యాపారులు ఇప్పటినుంచే సిద్ధమయ్యారు.