Pakistan Prime Minister: పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు కోవిడ్ -19 పాజిటివ్ అని తేలిందని పాక్ సమాచార శాఖ మంత్రి మరియం ఔరంగజేబ్ మంగళవారం ట్విట్టర్‌లో రాశారు.”ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. రెండు రోజులుగా ఆయన అస్వస్థతతో ఉన్నారు. వైద్యుల సలహా మేరకు ఈ రోజు కరోనా పరీక్ష జరిగింది. ప్రధాని త్వరగా కోలుకోవాలని ప్రజలు, కార్మికులు ప్రార్థించాలని అభ్యర్థించారు” అని ఔరంగజేబ్ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆయనకు కొవిడ్ సోకడం ఇది మూడోసారి. గతంలో ఈ ఏడాది జనవరిలో, జూన్ 2020లో కూడా పాకిస్తాన్ ప్రధానికి కొవిడ్ సోకింది.
Maharashtra: శివసేన వర్గాల మధ్య ఘర్షణ.. పోలీసుల లాఠీఛార్జి.. వీడియో వైరల్
పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N) అధ్యక్షుడు చివరిసారిగా జనవరి 2022లో కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. దాని తర్వాత మళ్లీ ఇప్పుడు పాజిటివ్ అని తేలింది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ యూకే పర్యటన నుంచి తిరిగి వచ్చిన ఒక రోజు తర్వాత కొవిడ్ పరీక్ష చేయించుకున్నారని.. అందులో పాజిటివ్ అని తేలిందని పాక్ మంత్రి మరియం ఔరంగజేబ్ మంగళవారం తెలిపారు. ఈ పర్యటనలో ఆయన సోదరుడు నవాజ్ షరీఫ్‌తో పాటు ఖవాజా ఆసిఫ్ సహా పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ నాయకులతో ఆయన చర్చలు జరిపినట్లు సమాచారం.
Pakistan PM Shehbaz tests positive for Covid-19, reports Pakistan Media
(File photo) pic.twitter.com/U3Arnveej1
— ANI (@ANI) November 15, 2022