Telangana Group-1: గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో 5 ప్రశ్నలు రద్దు.. తుది కీ విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Group-1: రాష్ట్రంలో 503 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి గత నెల 6వ తేదీన ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్.. మంగళవారం తన వెబ్‌సైట్‌లో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష తుది కీని విడుదల చేసింది. అభ్యంతరాల పరిశీలనకు ఏర్పాటైన నిపుణుల కమిటీ ప్రిలిమ్స్‌లోని 150 ప్రశ్నల్లో 5 ప్రశ్నలను రద్దు చేయాలని, 3 ప్రశ్నలకు ఆప్షన్లలో మార్పులు చేయాలని సిఫార్సు చేయడంతో ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు కమిషన్ వెల్లడించింది. ఈ విషయంలో ఇకపై ఎలాంటి అభ్యంతరాలకు తావులేదని తేల్చిచెప్పింది.
గ్రూప్-1 కీని పరిగణనలోకి తీసుకుంటే ఇందులో 29, 48, 69, 82, 138 ప్రశ్నలు రద్దయ్యాయి. దీంతో వాటిని మూల్యాంకనంలో పరిగణనలోకి తీసుకోరు. ప్రిలిమినరీ పరీక్షలో ఇచ్చిన 150 మార్కులకుగాను 145 ప్రశ్నలనే పరిగణిస్తారు. మొత్తం మార్కులను 145 ప్రశ్నలకు విభజిస్తారు. ఈ ప్రశ్నల్లో సరైన జవాబులు రాసిన వారికి విభజించిన (మూడో డెసిమల్ వరకు) మార్కుల ప్రకారం లెక్కిస్తారు. ఉదాహరణకు ఒక అభ్యర్థి 145 ప్రశ్నల్లో 120 ప్రశ్నలకు సరైన జవాబులు రాసినట్లయితే ఒక్కో ప్రశ్నకు 150/145 చొప్పున 120 జవాబులకు 124.137 మార్కులు నిర్దేశిస్తారు.
Also Read
Steve Jobs Old Sandals: స్టీబ్ జాబ్స్ పాత చెప్పుల వేలం.. ధరెంతో తెలిస్తే షాకవుతారు?
అక్టోబర్ 16న గ్రూప్-1 సర్వీసులకు ప్రిలిమినరీ పరీక్షను కమిషన్ నిర్వహించింది. అక్టోబర్ 29న ప్రిలిమినరీ కీని తన వెబ్‌సైట్‌లో విడుదల చేయగా, అక్టోబర్ 31 నుంచి నవంబర్ 4 వరకు ప్రిలిమినరీ కీపై టీఎస్‌పీఎస్సీ అభ్యంతరాలను స్వీకరించింది. కేవలం వెబ్‌సైట్‌లోని ప్రత్యేక లింక్ ద్వారా అభ్యంతరాలు స్వీకరించిన కమిషన్ తాజాగా తుది మాస్టర్ కీని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు