దళపతి విజయ్ అభిమానులు ట్విట్టర్‌ను షేక్ చేస్తున్నారు. 'దళపతి 67' సినిమాని డైరెక్ట్ చేయనున్న లోకేష్ కనగరాజ్ అండ్ టీం నుంచి ఒక ఫోటో బయటకి వచ్చింది. ఈ పిక్‌ని షేర్ చేస్తూ, విజయ్ ఫాన్స్ దళపతి 67 అనే హాష్ ట్యాగ్(#THALAPATHY67)ను ట్రెండ్ చేస్తున్నారు.
ప్రపంచ శాంతి భద్రతలకు ఉగ్రవాదం అత్యంత తీవ్రమైన ముప్పు అని, ఉగ్రవాదిని రక్షించడం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంతో సమానమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం అన్నారు. టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ అండ్ టెర్రరిజంలో గ్లోబల్ ట్రెండ్స్ అనే అంశంపై జరిగిన మూడో 'నో మనీ ఫర్ టెర్రర్' మంత్రివర్గ సదస్సు తొలి సెషన్‌కు అధ్యక్షత వహించిన సందర్భంగా షా ఈ వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తిరిగి గులాబీ గూటికి చేరతారనే కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. మళ్లీ గులాబీ కండువా కప్పుకుంటారని, ‘ఘర్ వాపసీ’ అంటూ ఈటల ఫొటోతో సోషల్ మీడియాలో పలువురు పోస్టులు పెడుతుండగా.. ఈ ప్రచారాన్ని ఈటల రాజేందర్ ఖండించారు.
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి ప్రహ్లాద జోషి దర్శించుకున్నారు. ఆయనకు పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు.
హైదరాబాద్‌లోని చంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. డీఎల్‌ఆర్‌ఎల్ రోడ్డుపై కొంతమంది దుండగులు ఓ వ్యక్తిపై కారంచల్లి కత్తులతో పొడిచి హత్య చేశారు.
మిస్ ఇండియా మానుషి చిల్లర్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మెగా హీరోతో ఆమె జోడి కట్టబోతున్నట్లు తెలుస్తోంది. యువ కథానాయకుడు వరుణ్‌తేజ్‌తో ఆమె జట్టు కట్టనుందా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే వినిపిస్తోంది.