ఎలాన్ మస్క్ ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న తర్వాత పలు సంచలన నిర్ణయాలను తీసుకుంటున్నాడు. జీవితకాల నిషేధానికి గురైన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాను పునరుద్ధరించాలా వద్దా అనే దానిపై ఓటు వేయాలని మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ వినియోగదారులను కోరుతూ ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్ ఒక పోల్‌ను ఏర్పాటు చేశారు.
భారత స్టార్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనిక బాత్రా శనివారం జరుగుతున్న సియా కప్ టోర్నమెంట్‌లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది, ఈవెంట్‌లో పతకం గెలిచిన మొదటి భారతీయ మహిళా ప్యాడ్లర్‌గా నిలిచింది.
రష్యాలోని ఆగ్నేయ సఖాలిన్ ద్వీపంలో ఐదు అంతస్థుల నివాస భవనంలో శనివారం తెల్లవారుజామున అనుమానాస్పద గ్యాస్ పేలుడు సంభవించి తొమ్మిది మంది మృతి చెందినట్లు స్థానిక గవర్నర్ తెలిపారు.
గుజరాత్ ఎన్నికల్లో ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ రోజువారీ కూలీ.. ఎన్నికల్లో పోటీ కోసం సేకరించిన రూపాయి నాణేలతో పది వేల డిపాజిట్ మొత్తం చెల్లించాడు.
రాను రాను సమాజంలో మానవ సంబంధాలు క్షీణిస్తున్నాయి. పొరుగు సంబంధాల గురించి దేవుడెరుగు.. రక్త సంబంధాలే రోజు రోజుకు తీసికట్టుగా తయారవుతున్నాయి. బంధాల కంటే డబ్బుపైనే ప్రేమ పెంచుకుంటున్నారు.
ప్రపంచ కప్ నిర్వాహకులు ఖతార్‌లోని స్టేడియాల సమీపంలో మద్యం అమ్మకాలను నిషేధించినట్లు ఫిఫా శుక్రవారం ప్రకటించింది. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో స్టేడియంలలో బీరు విక్రయిస్తారా లేదా అనే అంశంపై ఫిఫా ఖతార్ నిర్వాహకులు ఆలస్యంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
స్టార్ ప్యాడ్లర్ మనిక బాత్రా శుక్రవారం ఆసియా కప్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌లో చైనీస్ తైపీకి చెందిన చెన్ స్జు-యుపై 4-3 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరిన తొలి భారతీయ మహిళగా నిలిచింది.