FIFA World Cup: ప్రపంచ కప్ నిర్వాహకులు ఖతార్‌లోని స్టేడియాల సమీపంలో మద్యం అమ్మకాలను నిషేధించినట్లు ఫిఫా శుక్రవారం ప్రకటించింది. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో స్టేడియంలలో బీరు విక్రయిస్తారా లేదా అనే అంశంపై ఫిఫా ఖతార్ నిర్వాహకులు ఆలస్యంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయాన్ని ఫిఫా మీడియా ట్విట్టర్ ఖాతా ద్వారా ఫిఫా ప్రకటించింది. నెలరోజుల పాటు సాకర్ ప్రియులను ఉర్రూతలూగించనున్న ఈ వరల్డ్ కప్ నవంబరు 20న ప్రారంభం కానుంది. డిసెంబరు 18న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్‌లో ఈక్వెడార్ జట్టు ఆతిథ్య జట్టు ఖతార్‌తో ఢీకొంటుంది.
Manika Batra: ఆసియా కప్ టీటీ సెమీఫైనల్‌కు చేరిన తొలి భారతీయ మహిళగా మనిక బాత్రా
ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమిస్తున్న ఖతార్ ముస్లిం దేశం కావడంతో సహజంగానే అనేక ఆంక్షలు ఉంటాయి. వరల్డ్ కప్ మ్యాచ్ లు జరిగే స్టేడియంల పరిసరాల్లో బీర్లు అమ్మరాదని ఖతార్ ప్రభుత్వం హుకుం జారీ చేసింది. నాన్ ఆల్కహాలిక్ బీర్లపై ఎలాంటి నిషేధం లేదని స్పష్టం చేసింది. ఈ నిర్ణయానికి ఫిఫా కూడా మద్దతు పలికింది. ఖతార్ ప్రభుత్వం తాజా నిర్ణయం ప్రకారం స్టేడియంలలో కేవలం వీఐపీ సూట్లలో మాత్రమే బీర్లు అందుబాటులో ఉండనున్నాయి. వీటిని ఫిఫానే విక్రయించనుంది. అయితే, ఖతార్ లో అభిమానుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫ్యాన్ జోన్ లలో బీర్లు లభ్యమవుతాయని తెలుస్తోంది.