ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ఇంట సందడి వాతావరణం నెలకొంది. ముఖేష్ అంబానీ మరోసారి తాత అయ్యారు. ఆయన కూతురు, రిలయన్స్ రిటైల్ హెడ్ ఇషా అంబానీ కవలలకు జన్మనిచ్చారు.
భారత సైన్యానికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అందించాలని కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ తాజాగా నిర్ణయించింది. ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్న ఫ్రంట్ లైన్ ట్రూప్ సైనికులకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇవ్వనున్నారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ముంగిట మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ తమ వ్యూహాలకు పదునుపెట్టింది. ప్రధాని మోడీ, అమిత్ షాతో సహా అగ్రనేతలంతా ఆ రాష్ట్రంలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
అరుణాచల్ ప్రదేశ్‌లోని ఇటానగర్‌లో దోనీ పోలో విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ బీడీ మిశ్రా, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ, కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు, అరుణాచల్ ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి చౌనా మెయిన్, ఎంపీ నబమ్ రెబియా కూడా పాల్గొన్నారు.
గుజరాత్‌లో కీలకమైన అసెంబ్లీ ఎన్నికలకు ముందు రిటైర్డ్ బ్యూరోక్రాట్ అరుణ్ గోయల్ ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. దేశంలోని అత్యున్నత పోల్ బాడీలో మూడో పోస్టు దాదాపు ఆరు నెలలుగా ఖాళీగా ఉంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులు అభిషేక్ బోయిన్‌పల్లి, విజయ్ నాయర్‌లకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు మరో 5 రోజులు పొడిగించింది.
కోరేగావ్-భీమా కేసులో 2020 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న 70 ఏళ్ల కార్యకర్త గౌతమ్ నవ్‌లాఖాను గృహనిర్బంధంలో ఉంచాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు నవీ ముంబైలోని తలోజా సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.
రాహుల్ గాంధీ నేతృత్వంలోని 'భారత్ జోడో యాత్ర'ను నవంబర్ 28న ఖాల్సా స్టేడియంలో షెడ్యూల్ చేస్తే మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో బాంబు పేలుళ్లు జరుగుతాయని అజ్ఞాత లేఖ రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
ఇరాన్ ప్రభుత్వం చేస్తున్న దాష్టికాలకు అంతూ పొంతూ ఉండటం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతి యుతంగా ఆందోళనలు చేస్తున్న ప్రజలపై ఉక్కుపాదం మోపింది. దాడులు, అరెస్టులు, హత్యలతో ఇరాన్ దేశం మొత్తాన్ని ఓ యుద్ద క్షేత్రంలా మార్చింది. సెప్టెంబరులో మహ్సా అమిని అనే యువతి హిజాబ్ సరిగా వేసుకోలేదనే కారణంతో పోలీసులు కొట్టి చంపిన తర్వాత దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి.
శ్రద్ధా వాకర్‌ను హత్య చేసిన నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా గత నెల తెల్లవారుజామున తన ఇంటి వెలుపల నుంచి బ్యాగ్‌తో నడుచుకుంటూ వెళ్తున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో వెల్లడైంది. అఫ్తాబ్ శ్రద్ధ శరీర భాగాలను మోసుకెళ్ళినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.