Steve Smith: ఆస్ట్రేలియన్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 14,000 పరుగుల మార్క్‌ను దాటాడు. ఆస్ట్రేలియా నుంచి అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నిలిచాడు.సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో ఈ బ్యాటర్ ఈ మైలురాయిని సాధించాడు.ఈ మ్యాచ్‌లో స్మిత్ 114 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 94 పరుగులు చేశాడు. అతను 82.45 స్ట్రైక్ రేట్‌తో ఈ తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. .
ఇప్పుటి వరకు స్టీవ్ స్మిత్ 288 మ్యాచ్‌లు, 328 ఇన్నింగ్స్‌లలో, స్టీవ్ 49.52 సగటుతో 14,065 పరుగులు చేశాడు. మొత్తం 40 సెంచరీలు, 69 అర్ధ సెంచరీలు సాధించాడు, అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు 239 పరుగులు కాగా.. అతని స్ట్రైక్ రేట్ అన్ని ఫార్మాట్లలో 65.44గా ఉంది. స్టీవ్ స్మిత్ డేవిడ్ బూన్ (13,386)ను అధిగమించి ఆస్ట్రేలియా తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో తొమ్మిదో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఐదుగురు: రికీ పాంటింగ్ (27,368), స్టీవ్ వా (18,496), అలన్ బోర్డర్ (17,698), మైకేల్ క్లార్క్ (17,112), డేవిడ్ వార్నర్ (16,612).
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఐదుగురు: భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ (34,357), శ్రీలంక గ్రేట్ కుమార సంగకర (28,016), రికీ పాంటింగ్ (27,483), శ్రీలంక బ్యాటర్ మహేల జయవర్ధనే (25,957), గ్రేట్ సౌతాఫ్రికా ఆల్ రౌండర్ జాక్వెస్ కల్లీస్ (25,534)