punishment of five sit ups: మనిషి ప్రాణానికి ఖరీదెంత..? ఒక అమ్మాయి శీలానికి విలువెంత..? అన్యాయానికి ఎంత డబ్బు ఇస్తే న్యాయం అవుతుంది. ఇలాంటి ప్రశ్నలన్నీ ఓ బాలిక మనసును కదిలిస్తున్నాయి. అన్యాయం జరిగిందని పెద్దల సమక్షంలో మొరపెట్టుకుంటే.. వారు చెప్పిన తీర్పు మానవత్వానికి మకిలిపట్టించినట్టుంది. అత్యాచారం జరిగిందని, న్యాయం చేయమని అడిగితే.. నిందితుడికి గ్రామ పంచాయితీ పెద్దలు విధించిన శిక్ష అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ తీర్పును గమనిస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో మహిళలకు ఏమాత్రం రక్షణ ఉందో మనం ఊహించవచ్చు. వారికి రక్షణ కరువవడానికి కారణం గ్రామ పంచాయితీలు. పంచాయతీలోని గ్రామ పెద్దలే తీర్పు తీరుస్తారు. వారి మాటే శాసనం. బీహార్లో ఓ పంచాయితీ పెద్దలు అత్యాచార నిందితుడికి విధించిన శిక్ష న్యాయాన్ని అవహేళన చేసేదిగా ఉంది. కొన్నేళ్ల క్రితం ఐదేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం జోక్యం చేసుకున్న పంచాయితీ పెద్దలు నిందితుడికి ఐదు గుంజీలను శిక్షగా విధించారు. దీనిపై గ్రామస్థుల్లో అసహనం వ్యక్తమవుతోంది.
బీహార్‌లోని నవాడా జిల్లాలో అక్బర్‌పూర్ ప్రాంతంలో అత్యాచార నిందితుడైన వ్యక్తిని స్థానిక పంచాయితీ ‘ఐదు సిట్ అప్‌ల’ శిక్షతో విడిచిపెట్టింది. సోమవారం నాడు ఈ తీర్పును ప్రకటించింది. బుధవారం సాయంత్రం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.వైరల్ వీడియో ప్రకారం.. నిందితుడు యువకులను పదజాలంతో దుర్భాషలాడుతూ చాలా మంది జనాల మధ్య చెవులు పట్టుకుని గుంజీలు తీశాడు. స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నవాడా జిల్లా అక్బర్‌పూర్ పీఎస్ పరిధిలోని ఓ గ్రామంలో అరుణ్ పండిట్ అనే వ్యక్తి కోళ్లఫారంలో పనిచేసేవాడు. కొన్నేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన ఓ చిన్నారిని ప్రలోభపెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాధితురాలు తన ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి బయలుదేరగా.. కోళ్లఫారం యజమాని జోక్యం చేసుకుని ఆ విషయాన్ని పంచాయితీలో తేల్చుకుందాం అని సూచించాడు. చాక్లెట్లు ఇస్తానని చెప్పి బాలికను తన కోళ్ల ఫారానికి తీసుకెళ్లిన యువకుడిపై మైనర్ బాలిక కుటుంబం పంచాయతీకి ఫిర్యాదు చేసింది.
Asaduddin Owsisi: శ్రద్ధా వాకర్ హత్య “లవ్ జీహాద్” కాదు..
ఈ విషయంలో జోక్యం చేసుకున్న గ్రామ పంచాయితీ నవంబర్ 21న తమ తీర్పును వెల్లడించారు. ప్రజలంతా నిందితుడ్ని పోలీసులకు అప్పగిస్తారని అనుకుంటే పెద్దలు అలా చేయకుండా.. నిందితుడికి గ్రామస్థులందరి ముందు ఐదు గుంజీలను శిక్షగా విధించి, అతడ్ని విడిచి పెట్టారు. ఈ ఐదు గుంజీల తీర్పు పట్ల గ్రామస్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు ఇంత పెద్ద విషయాన్ని చిన్న శిక్షతో ఎలా సరిపెడతారని, అధికారులు జోక్యం చేసుకుని బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతున్నారు. గ్రామస్థులు ధైర్యం చెప్పడంతో బాలిక తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. చాక్లెట్లు ఇస్తానని చెప్పి బాలికను తన కోళ్ల ఫారానికి తీసుకెళ్లిన యువకుడిపై మైనర్ బాలిక కుటుంబం పంచాయతీకి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేశామని, కేసును సమగ్రంగా విచారిస్తామని నవాడ ఎస్పీ డాక్టర్ గౌరవ్ మంగ్లా తెలిపారు. యువకుడు తన కుమార్తెను తన ఒడిలో ఉంచుకుని అనుచితంగా తాకాడని బాలిక తండ్రి ఆరోపిస్తూ అక్బర్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.