World’s Oldest Cat: 26 ఏళ్ల ఫ్లాస్సీ.. ప్రపంచంలోనే అత్యంత వృద్ధ పిల్లిగా రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
World’s Oldest Cat: 1995లో జన్మించిన ఫ్లాస్సీని ప్రపంచంలోనే అత్యంత వృద్ధ పిల్లిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అధికారికంగా గుర్తించింది. ఒక పిల్లి 26 ఏళ్లు బతకడం అంటే దాదాపు మనిషి 120 సంవత్సరాలు బతకడంతో సమానమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నవంబర్ 10న 26 సంవత్సరాల 316 రోజులతో రికార్డ్ బుక్‌లలోకి ప్రవేశించింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ క్యాట్స్ ప్రొటెక్షన్ స్వచ్ఛంద సంస్థతో కలిసి ఈ రికార్డును ప్రదానం చేసింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ (జీడబ్ల్యుఆర్) విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, పెంపుడు జంతువు బాగా ఆరోగ్యంగా ఉంది. కానీ చూపు సరిగా లేకపోవడంతో పాటు చెవిటిది కూడా అని తెలిసింది. 26 ఏళ్ల 329 రోజుల వయసు ఉన్న ఈ పిల్లి మరికొద్ది రోజుల్లో 27వ పుట్టిన రోజు జరుపుకోనుంది. గిన్నిస్ రికార్డు సాధించిన ఈ పిల్లి పేరు ఫ్లాస్సీ. ఈ పిల్లి ఫొటోల్ని గిన్నిస్ సంస్థ ట్విట్టర్ ఖాతాలో పెట్టింది. దాంతో ఫ్లాస్సీ ఫొటోలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి.
Bombay High Court: విడాకుల కోసం భార్యకు హెచ్ఐవీ ఉందని అబద్ధం.. కోర్టు ఏం చేసిందంటే.?
Also Read
- Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
- Army Major: తోటి అధికారుల భార్యలతో వివాహేతర సంబంధం.. ఆర్మీ మేజర్‌పై చర్యలకు సిద్ధం.!
- Sri Lanka: శ్రీలంకలో తీవ్ర విద్యుత్ అంతరాయం.. నీరు, ఇంటర్నెట్ సేవలకు బ్రేక్!
- Abhijeet Dipke: అభిజిత్ దీప్కేకు ఊరట.. షరతులతో బెయిల్..!
1995లో మెర్సీసైడ్ ఆస్పత్రి పరిసరాల్లో కనిపించిన ఫ్లోసీను ఒక వర్కర్ పెంచుకునేందుకు ఇంటికి తీసుకెళ్లాడు. పదేళ్ల తర్వాత అతను చనిపోవడంతో అతని చెల్లెలు ఫ్లాస్సీ బాధ్యత తీసుకుంది. అలా ఇప్పటివరకూ చాలామంది యజమానుల దగ్గర పెరిగింది. గోధుమ, నలుపు రంగులో ఉన్న ఫ్లోసీని ప్రస్తుతం బ్రిటన్‌కు చెందిన విక్కీ గ్రీన్ అనే వ్యక్తి పెంచుకుంటున్నాడు. ఫ్లాస్సీ 26 ఏళ్ల వయసులోనూ చలాకీగా ఉంటుందని, చక్కగా ఆడుకుంటుందని విక్కీ తెలిపాడు. అంతేకాదు పూర్తి ఆరోగ్యంగా ఉందని కాకపోతే చూపు, వినికిడి శక్తి తగ్గాయని చెప్పాడు. ఇంతకుముందు ఈ రికార్డు అమెరికాకు చెందిన టిఫానీ టూ అనే పిల్లి పేరు మీద ఉండేది.
తాజావార్తలు
-
‘గాడ్ ఆఫ్ వార్’ అఫిషియల్ టైటిల్ కాదు.. NTR – Trivikram Movie పై నాగవంశీ బిగ్ క్లారిటీ!
-
Naga Vamsi: ‘జైలర్ 2 హై రేట్ పెట్టి ఎందుకు కొన్నానంటే’.. అసలు నిజం చెప్పిన నాగవంశీ!
-
Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
-
Pawan Kalyan Meets Mohan Yadav: పవన్ కళ్యాణ్‌తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక చర్చలు
-
Director Balraj Kalarickal: 28 ఏళ్లకే దర్శకుడు బాలరాజ్ కలరికల్ కన్నుమూత.. ‘కప్పి స్క్వాడ్’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!