Mumbai Terror Attacks: భారతావని మరువలేని మారణహోమానికి 14 ఏళ్లు.. ఆ గ్రామానికి కానిస్టేబుల్ పేరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai Terror Attacks 26/11: నవంబర్ 26, 2008న ముంబయిలో జరిగిన ఉగ్రదాడితో భారతావనితో పాటు యావత్ ప్రపంచం వణికిపోయిన విషయం తెలిసిందే. భారత్‌తోపాటు మరో 14దేశాలకు చెందిన మొత్తం 166 మంది ప్రాణాలు కోల్పోయిన ఆ మారణహోమం జరిగి నేటికి 14ఏళ్లు అయ్యింది. లష్కరే ఉగ్రమూకలు.. ముంబయిలోని 12 చోట్ల సృష్టించిన నరమేధంలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముంబయికి చెందిన పోలీసు ఉన్నతాధికారులు కూడా అమరులయ్యారు. వందల సంఖ్యలో సామాన్యులు తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే ముష్కరదాడుల్లో అమరుడైన ఓ కానిస్టేబుల్ పేరును మహారాష్ట్రలో ఆయన స్వగ్రామానికి పెట్టారు.
అసలేం జరిగిందంటే.. పాకిస్థాన్‌కు చెందిన పదిమంది ఉగ్రవాదులు.. నవంబర్ 26, 2008 సాయంత్రం కొలాబా సముద్రతీరం నుంచి ముంబయికి చేరుకొన్నారు. ఆ తర్వాత బృందాలుగా విడిపోయిన ముష్కరులు ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ రద్దీగా ఉన్న రైల్వే స్టేషన్‌లోకి చొరబడ్డారు. వెంటనే వారిచేతుల్లో ఉన్న ఏకే-47 తుపాకులను తీసి తూటాల వర్షం కురిపించారు. అక్కడ కన్పించిన వారినల్లా పిట్టల్లా కాల్చి చంపారు. ఊహించని ఘటనలతో వణికిపోయిన అక్కడి ప్రజలు భయంతో పరుగులు తీశారు. పోలీసులు అక్కడకు చేరుకునేలోపే దాదాపు 58 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడి నుంచి బయటకు వచ్చిన ఉగ్రవాదులు వీధుల్లోకి వచ్చి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఆ తర్వాత వరుసగా కామా హాస్పిటల్, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, నారిమన్ లైట్ హౌస్ ఇలా వరుసగా 12 చోట్ల ఏకధాటిగా కాల్పులు, బాంబుల మోత మోగింది. దాదాపు 60 గంటల పాటు సాగిన ఆ మారణహోమంలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 18 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారిలో కేవలం భారతీయులే కాకుండా మరో 14 దేశాలకు చెందిన పౌరులు కూడా ఉన్నారు.
Also Read
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
- West Bengal Bypolls: మమతా బెనర్జీకి మరో షాక్.. రేజీనగర్ అభ్యర్థి కూడా బరి నుంచి ఔట్
- Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
Bharat Biotech: బూస్టర్ డోస్‌గా భారత్ బయోటెక్ చుక్కల మందు టీకా
ఊరికి ఆయన పేరు.. ముంబైలో జరిగిన 26/11 దాడుల్లో ఎందరో ప్రాణాలు కోల్పోయారు. 2008లో ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌పై ఉగ్రవాదులు దాడి చేయగానే స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (ఎస్ఆర్‌పీఎఫ్) కానిస్టేబుల్ రాహుల్ షిండే అందులోకి వెళ్లారు. అయితే ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో బుల్లెట్ శరీరంలోకి చొచ్చుకెళ్లడంతో రాహుల్ షిండే మరణించారు. ఈ మేరకు ప్రాణాలు అర్పించిన ఆయన పేరును ఓ గ్రామానికి పెట్టారు. ఆయన త్యాగానికి గుర్తుగా రాహుల్ స్వగ్రామం సోలాపుర్ జిల్లా ‘సుల్తాన్‌పుర్’ గ్రామానికి ‘రాహుల్ నగర్’ అని పేరు మార్చాలని గ్రామస్థులు నిర్ణయించారు. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇప్పటికే రాహుల్ షిండే మరణానంతరం కేంద్ర ప్రభుత్వం ఆయన త్యాగానికి గుర్తుగా రాష్ట్రపతి పోలీస్ పతాకాన్ని ప్రదానం చేసింది. తాజాగా తమ గ్రామం పేరు మార్పునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని.. తాము అధికారుల ప్రకటన కోసం వేచి చూస్తున్నామని దివంగత రాహుల్ షిండే తండ్రి సుభాష్ విష్ణు షిండే మీడియాకు తెలియజేశారు.
బాధితులకు న్యాయం జరిగేంతవరకు భారతదేశం తన ప్రయత్నాలను ఎప్పటికీ వదులుకోదని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఈరోజు 14వ వార్షికోత్సవం సందర్భంగా 26/11 ముంబై ఉగ్రదాడుల బాధితులను భారతదేశం స్మరించుకున్న సందర్భంగా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్.. “ఈ దాడికి ప్లాన్ చేసిన, పర్యవేక్షించిన వారిని తప్పనిసరిగా శిక్షించాలి” అని ట్వీట్ చేశారు. 166 మంది మరణించిన మరియు 300 మందికి పైగా గాయపడిన ఘోరమైన దాడి నుంచి చిత్రాలను కలిగి ఉన్న ఒక చిన్న వీడియోను ఆయన పంచుకున్నారు.
తాజావార్తలు
-
Motorola Signature 27: మోటరోలా Signature 27 లాంచ్ డేట్ కన్ఫర్మ్.. 200MP కెమెరా, Dolby Vision సపోర్ట్, ప్రీమియం డిజైన్
-
PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
-
West Bengal Bypolls: మమతా బెనర్జీకి మరో షాక్.. రేజీనగర్ అభ్యర్థి కూడా బరి నుంచి ఔట్
-
Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
-
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!