Guide Married Belgium girl: వారిద్దరు ప్రేమకు హద్దులు లేవని మరోసారి నిరూపించారు. కర్ణాటకలోని హంపికి చెందిన అనంతరాజు,
బెల్జియం దేశానికి చెందిన కెమిల్లెల విషయంలో ఈ మాట నిజమని మరోసారి రుజువైంది. హంపికి చెందిన టూరిస్ట్ గైడ్ అనంతరాజు (30) శుక్రవారం ఇక్కడి ప్రసిద్ధ విరూపాక్ష దేవాలయంలో బెల్జియంకు చెందిన కెమిల్లె (27)ని వివాహం చేసుకున్నాడు. వరుడు అనంతరాజు హంపిలో ఆటోరిక్షా నడుపుతున్నాడు. బెల్జియంకు చెందిన కెమిల్లె తన కుటుంబం పాటు 2019లో కర్ణాటక విజయనగర జిల్లా హంపిని సందర్శించింది. అతను తన కుటుంబంతో కలిసి హంపిని సందర్శించినప్పుడు మొదటిసారి కెమిల్లెను కలిశాడు. ఆ సమయంలో హంపి జనతా ప్లాట్‌కు చెందిన ఆటోడ్రైవర్ అయిన అనంతరాజుతో పరిచయం ఏర్పడింది. ఇక్కడ ఉన్నన్నిరోజులు వాళ్ల గైడ్‌గా ఉన్నాడు రాజు. ఎక్కడా మోసం చేయకుండా ప్రయాణికులతో, విదేశీయులతో అతను వ్యవహరించిన తీరు, నిజాయితీ ఆమెను విపరీతంగా ఆకర్షించాయి.
కెమిల్లెతో పాటు ఆమె కుటుంబం అనంతరాజు నిజాయితీ, ఉత్సాహానికి ముగ్ధులయ్యారు. కెమిల్లె బెల్జియంకు తిరిగి వచ్చిన తర్వాత, వారు సోషల్ మీడియాలో సన్నిహితంగా ఉండి మాట్లాడటం కొనసాగించారు. వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. కానీ కోవిడ్-19 మహమ్మారి కారణంగా కలుసుకోలేకపోయారు. ఆరు నెలల క్రితం, ఇద్దరూ తమ కుటుంబ సభ్యులకు తమ ‘సుదూర ప్రేమ’ గురించి చెప్పారు. దానిని వారు కూడా ఆమోదించారు.
గురువారం సాయంత్రం వీరిద్దరి నిశ్చితార్థం హోసపేటలో జరగగా, అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. “కెమిల్లె తన తల్లిదండ్రులు , తోబుట్టువులతో కలిసి 2019లో హంపికి వచ్చింది. వారు మొదటిసారిగా హంపిని సందర్శించినందున వారి బస, ఆహారం గురించి ఆందోళన చెందారు. కానీ వారికి హంపిలోని అత్యుత్తమ హోటల్‌లు ఉండేలా చూసుకున్నాను. కుటుంబ సభ్యులు ఏర్పాట్లకు సంతోషించారు. వారు మళ్లీ హంపిని సందర్శిస్తారని నాకు హామీ ఇచ్చారు, ”అని అనంతరాజు వివరించారు.
Delivery Boy Kiss woman : డెలివరీ ఇచ్చాడు.. ముద్దు పెట్టాడు.. ఆ డెలివరీ బాయ్‌ని ఆమె ఏం చేసిందంటే
ఇంతలో అనంతరాజు, కెమిల్లె సోషల్ మీడియా, ఫోన్‌లో టచ్‌లో ఉన్నారు. కరోనా సమయంలో వాళ్ల వివాహం జరగాల్సి ఉంది. బెల్జియంలో గ్రాండ్‌గా పెళ్లి ప్లాన్ చేశారు ఆమె తల్లిదండ్రులు. ఈలోపు.. కరోనా పరిణామాలతో ఆ పెళ్లి వాయిదా పడింది. దీంతో ఇరు కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. కెమిల్లె బెల్జియంలో ఓ సామాజిక వేత్త. ఈ గ్యాప్‌లో వాళ్ల బంధం మరింత బలపడింది. ఆమెకు మరో వ్యక్తితో వివాహం చేయాలని ప్రయత్నాలు మొదలయ్యాయి. ఎలాగైనా రాజునే పెళ్లి చేసుకుంటానని భీష్మించుకుని కూర్చుంది. చివరికి వాళ్ల ఇంట్లో వాళ్లు.. రాజు తల్లిదండ్రులతో మరోసారి పెళ్లి సంప్రదింపులు మొదలుపెట్టారు.
ఎట్టకేలకు భారత్‌లోనే వారి పెళ్లి బాజాలు మోగాయి. నవంబర్ 25 హంపిలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. హంపీ విరూపాక్షేశ్వర ఆలయంలో పెద్దలు, బంధు మిత్రుల నడుమ ఘనంగా వివాహం జరిగింది. కెమిల్లె తరఫు దాదాపు 40 మంది బంధువులు, స్నేహితులు వివాహం కోసం హంపికి వచ్చారు. “ఇది నాకు, నా కుటుంబానికి గొప్ప క్షణం. ప్రేమకు హద్దులు లేవని నా పెళ్లి రుజువు చేసింది’’ అని కెమిల్లె వివరించారు. తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం గొప్ప అనుభూతిని కలిగిస్తోందని కెమిల్లె చెప్పారు.