MLA Thopudurthi Prakash Reddy: కాటికి కాలు చాచిన చంద్రబాబును చంపే అవసరం ఎవరికీ లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Thopudurthi Prakash Reddy: తనను, లోకేష్‌ను చంపేస్తారట అంటూ మాట్లాడిన చంద్రబాబు మాటలకు రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాటికి కాలు చాచిన చంద్రబాబును చంపే అవసరం ఎవరికీ లేదని ఆయన అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే 150 హత్యలు జరిగాయని ఎమ్మెల్యే ఆరోపించారు. తనకు ప్రాణం హాని చేస్తారనే ఆందోళనతోనే తన అన్న తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి అలా మాట్లాడి ఉండొచ్చని ప్రకాష్ రెడ్డి వెల్లడించారు. పరిటాల రవి హయాంలో ఎన్ని హత్యలు జరిగాయో అందరికీ తెలుసన్నారు.
పరిటాల రవి అనుచరుడు జగ్గుతో అమ్మను తిట్టించారని.. కొడుకులుగా మాకు బాధ ఉండదా..? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రాణహాని కల్గుతుందన్న బాధతో తన అన్న చంద్రశేఖర్ రెడ్డి అలా మాట్లాడి ఉండొచ్చని.. ఆయన మాట్లాడిన భాష మీద పెద్దలు మందలించారని.. క్షమాపణ కూడా చెప్పామన్నారు. మరి మా తల్లిని తిట్టిన దానికి ఒక్క టీడీపీ నేత అయినా తప్పు అని చెప్పారా అంటూ ప్రశ్నించారు. 3వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జనంలోకి వెళ్తామని ఆయన అన్నారు. వెళ్లిన ప్రతి చోటా తాము చేసిన అభివృద్ధి.. వారు చేస్తున్న అరాచకాలు చెప్తామని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. పరిటాల సునీత తిట్టించిన అంశాన్ని కూడా జనానికి చెబుతామన్నారు. పరిటాల రవి నేర చరిత్ర చూసి టీడీపీలో రాజకీయ పట్టాభిషేకం చేశారని.. తమ సోదరుడైన చంద్రశేఖర్ రెడ్డిని అప్పట్లో పరిటాల రవి చంపాలని చూశారని ఆరోపించారు. ఆ సమాచారం చెప్పిన వారిని ఎన్ కౌంటర్ చేయించాడని ఆరోపణలు చేశారు.
Also Read
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
Chandrababu: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు.. ”నన్ను, లోకేష్‌ని కూడా చంపేస్తారట..”
మద్దెల చెరువు సూరి కుటుంబం మొత్తాన్ని రవి చంపించారని.. అందుకే సూరి రవిని చంపి ప్రతీకారం తీర్చుకున్నారని ఆరోపించాడు. 150హత్యలు చేసినా వారికి ఎందుకు శిక్ష పడలేదు.. ఎవరు కాపాడారని ప్రశ్నించాడు. 2009లో నన్ను ఓడించేందుకు.. జైలులో ఉన్న సూరీతో రాజీ పడ్డారని ఆయన పేర్కొన్నారు. సూరిని భానుతో చంపించింది పరిటాల సునీతనే అని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు.
తాజావార్తలు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!