AP Chief Secretary: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డి బాధ్యతలను స్వీకరించారు. డిసెంబర్ 1న బాధ్యతలు చేపట్టాల్సి ఉండగా.. నేడు ముహూర్తం బాగుండడంతో ఇవాళ స్వీకరించారు. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ సాయంత్రం 4గంటలకు సీఎస్‌గా సమీర్ శర్మ పదవీ కాలం ముగిసింది. జవహర్ రెడ్డికి మాజీ సీఎస్ సమీర్ శర్మ బాధ్యతలను అప్పగించారు. ఇప్పటి వరకు జవహర్ రెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. అలాగే టీటీడీ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారు.
AP CM Jaganmohan Reddy: సీఎం జగన్ రెండు రోజుల వైఎస్సార్ కడప జిల్లా పర్యటన ఖరారు
ఇప్పటికే రెండుసార్లు పొడిగింపు పొందిన సమీర్ శర్మ పదవీకాలం ముగిసింది. ఆయన 2021 అక్టోబరు 1న సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించారు. అదే ఏడాది నవంబరు 30తో ఆయన రిటైర్ అవుతున్నారు. అయితే… రాష్ట్ర ప్రభుత్వ వినతి మేరకు కేంద్రం ఆయన సేవలను మరో ఆరు నెలలు పొడిగించింది. ఈ ఏడాది మే 30 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సమీర్ శర్మ పదవీకాలాన్ని మరో ఆరునెలలు పొడిగించాలని మరోసారి కేంద్రాన్ని కోరింది. అసాధారణ రీతిలో కేంద్రం ఈ ప్రతిపాదనను కూడా అంగీకరించింది. అంటే… ఈ నెలాఖరుతో ఆయన పదవీకాలం ముగియనుంది. సమీర్ శర్మను వదులుకోవడం ఇష్టంలేకో… మరో కారణంవల్లో 2023 నవంబరు వరకు ఆయన పదవీకాలం పెంచాలని కేంద్రాన్ని మరోసారి అడిగారు. కేంద్రం అందుకు అంగీకరించలేదు. ఇటీవల ఆయన ఆరోగ్యం కూడా సహకరించడం లేదు. దీంతో ఆయన పదవీ విరమణ ఖాయమైంది.