చాలా సందర్భాల్లో పెళ్లికొడుకు పొట్టిగా ఉన్నాడనో, నల్లగా ఉన్నాడనో, చెడు అలవాట్లు ఉన్నాయనో, అతడి బ్యాక్‌గ్రౌండ్ బాగా లేదనో.. వధువులు పెళ్లి రద్దు చేసిన ఘటనలు చూసి ఉంటారు. ఎక్కడైనా అలాంటి వార్తలు చదివుంటారు. కానీ వరుడి ముక్కు చిన్నగా ఉందని ఓ వధువు ఏకంగా పెళ్లిని క్యాన్సిల్ చేసింది.
ముస్లిం మహిళలకు న్యాయం చేయడానికి పురుషులు ముగ్గురు-నలుగురు మహిళలను వివాహం చేసుకునే విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ గురువారం అన్నారు. ముస్లిం సమాజానికి చెందిన పురుషులు బహుళ భార్యలను కలిగి ఉండడాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందని అన్నారు.
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని నిర్ణయించడానికి శుక్రవారం సిమ్లాలో సమావేశం కానున్నారు. హిమాచల్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం రాజీవ్ భవన్‌లో జరగనుంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుఫాను త్వరలో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నందున తమిళనాడులో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో వివిధ విభాగాలకు సంబంధించి 9,79,327 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభలో వెల్లడించారు. రైల్వే మంత్రిత్వ శాఖలో 2,93,943, రక్షణ శాఖలో 2,64,704 మంది, హోం వ్యవహారాల్లో 1,43,536 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.
గుజరాత్ ప్రజలు బీజేపీవైపేనని మరోసారి నిరూపించారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన అనంతరం ఆయన బీజేపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు.
గుజరాత్‌లో సరికొత్త రికార్డు సృష్టిస్తూ కమలం పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. వరుసగా ఏడోసారి విజయం సాధించి 37 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. 182 స్థానాల్లో 156 స్థానాలను కైవసం చేసుకుంది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రికార్డు విజయాన్ని సాధించింది. మొత్తం 182 స్థానాలకు గానూ 156 స్థానాల్లో గెలుపొంది రికార్డు విజయాన్ని నమోదు చేసింది. ఇక ఈ ఎన్నికల్లో జూమ్ నగర్ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య.. రివాబా జడేజా ఘనవిజయం సాధించింది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ నేపథ్యంలో కాంగ్రెస్ గుజరాత్ ఇన్‌ఛార్జి రఘు శర్మ తన రాజీనామాను కాంగ్రెస్ అధినేత మల్లికార్జున్ ఖర్గేకి గురువారం సమర్పించారు.