రేపే Xiaomi QLED TV X Pro లాంచ్.. AI ఫీచర్లు, భారీ స్క్రీన్‌తో కొత్త స్మార్ట్ టీవీ..
- రేపే భారత్‌లో బిగ్ స్క్రీన్ స్మార్ట్ టీవీ విడుదల..
- 75 అంగుళాల భారీ టీవీని రిలీజ్ చేయనున్న షియోమీ..
- AI ఫీచర్లు, భారీ స్క్రీన్‌తో మార్కెట్ లోకి కొత్త స్మార్ట్ టీవీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Xiaomi QLED TV X Pro: చైనా టెక్ దిగ్గజం Xiaomi భారత్‌లో కొత్త బిగ్ స్క్రీన్ స్మార్ట్ టీవీని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. Xiaomi QLED TV X Pro 75 2026 మోడల్‌ను రేపు (ఫిబ్రవరి 19న) భారత మార్కెట్‌లో లాంచ్ చేయనుంది. 2021లో విడుదలైన Mi QLED TV 75 తర్వాత మళ్లీ 75 అంగుళాల భారీ టీవీని కంపెనీ తీసుకొస్తుంది.
Read Also: Silver Rates: వెండి పతనం.. ఈరోజు ఎంత తగ్గిందంటే..!
Also Read
- Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
- 50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
- Huawei Mate 90 Pro Max: హువావే Mate 90 Pro Max లాంచ్.. 200MP RYYB కెమెరా, 6,800mAh బ్యాటరీ, 6.9 అంగుళాల డిస్‌ప్లే
- JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
భారీ డిస్‌ప్లే:
ఈ టీవీ 75 అంగుళాల పెద్ద స్క్రీన్‌తో రానుంది. “See the BIG Picture” అనే ట్యాగ్‌లైన్‌తో ప్రచారం చేస్తోంది. “MaxMagiQ” అనే పేరుతో కొత్త ప్రాసెసింగ్ లేదా డిస్‌ప్లే ఇంజిన్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా మరింత స్పష్టమైన, కాంతివంతమైన, క్లియర్ విజువల్స్‌ను అందిస్తామని కంపెనీ పేర్కొనింది. లోతైన కాంట్రాస్ట్, మెరుగైన చిత్ర నాణ్యత ఈ టీవీ ప్రత్యేకతగా ఉండే ఛాన్స్ ఉంది.
ఇంట్లోనే సినిమా అనుభూతి:
“Cinema MagiQ” పేరుతో ఈ స్మార్ట్ టీవీని హోమ్ థియేటర్ అనుభూతి కోసం రూపొందించినట్లు టీజర్‌లో షియోమీ పేర్కొంది. మీ లివింగ్ రూమ్‌నే థియేటర్‌గా మార్చేస్తుందని తెలిపింది. HDR లాంటి ఆధునిక ఫీచర్లు లేదా ప్రత్యేక సినిమా మోడ్‌లు ఉండే అవకాశం ఉంది.
Read Also: Amazon Logo Mehndi: అమెజాన్ లో చిగురించిన ప్రేమ.. పెళ్లిలో చేతిపై ఐకానిక్ స్మైల్ లోగోతో వధువు
స్పోర్ట్స్ అండ్ AI ఫీచర్లు:
“Sporting MagiQ on MAX” పేరుతో స్పోర్ట్స్ వీక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా క్రికెట్ వంటి ఆటలను బ్లర్ లేకుండా చూపేందుకు AI ఆధారిత మోషన్ స్మూతెనింగ్ (MEMC) వంటి ఫీచర్లు ఉండవచ్చని అంచనా. ఆటో పిక్చర్ ఆప్టిమైజేషన్ ఫీచర్లు కూడా ఉండే ఛాన్స్ ఉంది.
గేమింగ్, సౌండ్ ప్రత్యేకతలు:
“Gaming On MAX” సెగ్మెంట్ ద్వారా గేమింగ్‌కు కూడా ఈ స్మార్ట్ టీవీ అనుకూలంగా ఉంటుందని సూచించారు. హై రిఫ్రెష్ రేట్, తక్కువ లేటెన్సీ (ALLM) వంటి ఫీచర్లు ఉండనున్నట్లు తెలుస్తుంది. అలాగే, “MAX Sound” పేరుతో మెరుగైన సౌండ్ సిస్టమ్ అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. శక్తివంతమైన స్పీకర్లు లేదా అడ్వాన్స్‌డ్ ఆడియో ప్రాసెసింగ్ టెక్నాలజీ ఉండవచ్చని సమాచారం.
లాంచ్ వివరాలు:
ఈ షియోమీ కొత్త స్మార్ట్ టీవీ రేపు (ఫిబ్రవరి 19) అధికారికంగా విడుదల కానుంది. mi.com వెబ్‌సైట్‌తో పాటు Amazon.in లాంటి ఆన్‌లైన్ స్టోర్స్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో కూడా అందుబాటులో ఉండనుంది. ఈ కొత్త టీవీ పెద్ద స్క్రీన్‌తో సినిమాలు, స్పోర్ట్స్, గేమింగ్ అనుభూతిని మరింత మెరుగ్గా అందించాలనే లక్ష్యంతో Xiaomi ఈ టీవీని మార్కెట్‌లోకి తీసుకువస్తోంది.
తాజావార్తలు
-
CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
-
2027 ODI World Cup: భారత్, పాకిస్థాన్ మూడు సార్లు ఢీకొట్టే ఛాన్స్.. అదెలాగంటే?
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్‌ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Blood Donation Camp: రక్తదాన శిబిరంలో ‘కులం’ కలకలం.. తమిళనాడులో వివాదం
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?