Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ పాన్ ఇండియన్ సినిమా ‘పుష్ప ది రైజ్’ గతేడాది ప్రేక్షకుల ముందుకు భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించి ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. దేశవ్యాప్తంగా అభిమానులను తన అద్భుత నటనతో అల్లు అర్జున్ ఆకట్టుకున్నారు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో మాస్ యాక్షన్‌తో రూపొందిన ‘పుష్ప’కు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 146 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 175 కోట్లు పైగా వసూలు చేసింది. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఇక దీనికి సీక్వెల్‌గా “పుష్ప ది రూల్” చిత్రం రూపొందనుంది.
Kangana Ranaut: చంద్రముఖిగా కాంట్రవర్సీక్వీన్.. ఫస్ట్ లుక్ పోస్టర్ అదుర్స్
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన ‘పుష్ప’ మూవీ రెండు భాగాలుగా రాబోతుందని చిత్ర యూనిట్ ముందే ప్రకటించింది. ఇందులో మొదటి దాన్ని ‘పుష్ప.. ద రైజ్’ టైటిల్‌తో విడుదల చేశారు. అలాగే, ఇప్పుడు రెండో భాగానికి ‘పుష్ప.. ద రూల్’ అనే టైటిల్ పెట్టారు. ఇందులో పుష్ప రూలర్‌గా ఎలా మారాడు అన్న విషయాన్ని హైలైట్ చేసి చూపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమాపై అల్లు అర్జున్ అభిమానులతో పాటు ప్రేక్షకులందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొత్తం పూర్తి చేసుకున్న ‘పుష్ప ది రూల్’ సినిమా సోమవారం నుంచి హైదరాబాద్‌లో జరుగనున్న ఫస్ట్ షెడ్యూల్‌తో పట్టాలెక్కనున్నట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ సినిమా కోసం పలు భారీ సెట్స్ సిద్ధం అయ్యాయని, మొదటి భాగాన్ని మించేలా మరింత అద్భుతంగా సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు చిత్ర యూనిట్ చెప్తోంద. కాగా ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా ఫహాద్ ఫాసిల్, భన్వర్ సింగ్ షెకావత్ అనే నెగెటివ్ రోల్ చేస్తున్నారు. వచ్చే ఏడాది చివరలో ‘పుష్ప ది రూల్’ మూవీ ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం ఉంది.