Shocking: ఆహారంలో వెంట్రుక వచ్చిందని భార్యకు గుండు కొట్టించాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking News: భోజనంలో తల వెంట్రుక వచ్చిందని ఓ భర్త కట్టుకున్న భార్యకే గుండు కొట్టించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో చోటుచేసుకుంది. భోజనం చేస్తుండగా.. ఆహారంలో తల వెంట్రుక వచ్చిందని భార్యతో గొడవకు దిగాడు. భోజనం చేస్తుండగాఆహారంలో తల వెంట్రుకలు వచ్చాయని కోపోద్రిక్తుడైన భర్త, అత్తమామలు ఆ మహిళకు గుండు కొట్టించారు. దీంతో ఆ వివాహిత తన భర్తతో సహా ముగ్గురిపై వరకట్న చట్టంలో పలు సెక్షన్ల కింద కేసు పెట్టింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేశారు.
ఆ మహిళ పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని పిలిభిత్ జిల్లా మిలాక్ గ్రామానికి చెందిన జహీరుద్దీన్‌కు, సీమాదేవికి 7 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. పెళ్లయినప్పటి నుంచి రూ.15 లక్షలు కట్నం ఇవ్వాలని అత్తింటివారు తనను వేధిస్తున్నారని సీమాదేవి తెలిపింది. కాగా, శుక్రవారం రాత్రి ఇంట్లో మహిళ వంట చేసింది. తర్వాత ఆమె తన భర్తకు ఒక ప్లేట్‌లో భోజనం వడ్డించింది.
Also Read
Asaduddin Owaisi: నలుగురు భార్యలు ముస్లింలకు చట్టబద్ధమే
భోజనం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ప్లేట్‌లో వెంట్రుకలు రావడంతో భర్త జహీరుద్దీన్‌కు కోపం వచ్చింది. ఈ నేపథ్యంలో తన భార్యకు గుండు కొట్టించాడు. అన్నదమ్ములు జమీరుద్దీన్ బరాసత్, జులేఖా ఖాతూన్‌లతో కలిసి భర్త వివాహితను కొట్టారు. అంతే కాదు తన చేతులు, కాళ్లు కట్టేసి నోటిలో గుడ్డను బిగించి.. ఆ తర్వాత శృంగారానికి ప్రయత్నించాడని.. ఇచ్చాడని మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. భర్త క్రూరత్వానికి పాల్పడుతున్నాడని, తన భర్తను రెచ్చగొట్టి బావమరిది, అత్తమామలు సహకరిస్తున్నారని మహిళ తెలిపింది. ఘటన అనంతరం వివాహిత ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివాహిత నుంచి అందిన ఫిర్యాదు ఆధారంగా.. నిందితులపై వరకట్న చట్టంతో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళ భర్తను అరెస్టు చేసి జైలుకు పంపినట్లు పోలీసు అధికారి సతీష్ శుక్లా చెప్పారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!