India-China Clash Video: తరిమి తరిమికొట్టిన భారత జవాన్లు.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-China Clash Video: అరుణాచల్ ప్రదేశ్‌లోని సరిహద్దు వద్ద డిసెంబర్ 9న భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణను ప్రభుత్వం ధృవీకరించిన ఒక రోజు అనంతరం.. అంతకుముందు జరిగిన ఘర్షణకు సంబంధించిన తేదీ లేని వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియో బహుశా గత సంవత్సరం, అరుణాచల్ ప్రదేశ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన భీకర పోరు అని ఆర్మీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ వీడియో డిసెంబర్ 9 ఘటనకు సంబంధించినది కాదని ఆర్మీ గట్టిగా ఖండించింది.
2020 జూన్‌లో తూర్పు లడఖ్‌లోని గాల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణల్లో దేశం కోసం 20 మంది భారతీయ సైనికులు మరణించారు. 40 మందికి పైగా చైనా సైనికులు మరణించారు. చైనా సైనికులు భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించగా.. భారత సైనికులు ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టారు. ఈ వీడియో ఎల్‌ఏసీని దాటడానికి ప్రయత్నిస్తున్న చైనా సైనికులతో భారత సైనికులు హింసాత్మకంగా ఘర్షణ పడుతున్నారు. “వాళ్ళను గట్టిగా కొట్టండి, వారు తిరిగి రారు” అని జవాన్లు పంజాబీలో చెప్పడం వినబడుతుంది. భారతీయ సైనికులు చైనా సైనికులను లాఠీలతో కొట్టడం, చైనీయులు ముందుకు రాకుండా విజయవంతంగా ఆపగలిగారు. గత వారం జరిగిన సంఘటన బహిర్గతం కావడంతో వివిధ రాజకీయ నేతలు ఈ వీడియోను షేర్ చేశారు.
Also Read
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
- TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
నిన్న పార్లమెంటులో, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డిసెంబర్ 9న అదే ప్రాంతంలో భూసేకరణకు చైనా చేసిన ప్రయత్నాన్ని ధృవీకరించారు. ఇరుపక్షాల మధ్య భౌతిక ఘర్షణ జరిగింది. భారత సైనికులు వీరోచితంగా పోరాడి చైనా సైనికులను వెనక్కి పంపించారని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఇరుదేశాల సైనికులకు గాయాలయ్యాయని ఆయన తెలిపారు. చైనీస్ దళాలు యాంగ్ట్సే, తవాంగ్‌లో ఎల్‌ఏసీని అతిక్రమించడానికి ప్రయత్నించాయని వెల్లడించారు. భారత సైనిక కమాండర్లు సకాలంలా జోక్యం చేసుకోగా.. చైనా సైనికులు తిరిగి తమ స్థానాలకు వెళ్లారన్నారు. కమాండర్ల సమావేశంలో చైనీయులు ఇలాంటి చర్యలకు దూరంగా ఉండాలని, సరిహద్దులో శాంతి, ప్రశాంతతను కాపాడాలని కోరారు. ఇదిలా ఉండగా.. ఘర్షణపై స్పందించని చైనా.. సరిహద్దు వద్ద పరిస్థితి సాధారణంగా ఉందని పేర్కొంది.
తాజావార్తలు
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
-
India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
-
OTR: మానుకోటలో కారు పార్టీ గ్రూప్ వార్‌పై కేటీఆర్ క్లాస్..?
-
CM Revanth Reddy : సిరిసిల్లకు సీఎం రేవంత్.. రూ.345 కోట్ల అభివృద్ధి ప్యాకేజీ
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!