ANR’s Premabhishekam: 45 ఏళ్లు పూర్తి చేసుకున్న‘ప్రేమాభిషేకం’.. స్పెషల్ వీడియో వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్రసీమలో ‘నటసామ్రాట్’ అక్కినేని నాగేశ్వరరావు నటించిన చిత్రాల్లో ‘ప్రేమాభిషేకం’ ఒక మైలురాయి. కేవలం ఒక సినిమాగా మాత్రమే కాకుండా, అప్పట్లో ఇదొక సంచలనంగా నిలిచింది. ఈ చిత్రం విడుదలై నేటికి 45 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రత్యేక వీడియోను షేర్ చేస్తూ ఏఎన్నార్‌కు ఘన నివాళులు అర్పించింది.
Also Read : Alia Bhatt :79వ బాఫ్టాలో ప్రెజెంటర్‌గా ఆలియా అరుదైన గౌరవం..
Also Read
- Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్‌పై కనిమొళి సెటైర్లు.!
- UP Elections: ‘‘అభ్యర్థి పేరు చెప్పండి.. సీటు తీసుకోండి’’.. కాంగ్రెస్‌కు ఎస్పీ కొత్త కండిషన్
- Shree Charani: ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోతున్న తెలుగు బిడ్డ.. రికార్డులను తిరగరాస్తున్న శ్రీచరణి..
- Smriti Irani: ‘‘కర్ణాటక, కేరళ, హిమాచల్‌లో గెలిచింది ఎలా?’’.. కాంగ్రెస్‌పై స్మృతి ఇరానీ ఫైర్
1981 ఫిబ్రవరి 18న విడుదలైన ఈ చిత్రం, అప్పట్లో అనేక కేంద్రాలలో ఏడాదికి పైగా (365 రోజులు) ప్రదర్శితమై సరికొత్త రికార్డులు సృష్టించింది. ఒక తెలుగు సినిమా ఇన్ని థియేటర్లలో షిఫ్టులు లేకుండా ఏడాది పాటు ఆడటం అప్పట్లో ఒక సంచలనం. దర్శకుడు దాసరి నారాయణ రావు తెరకెక్కించిన ఈ చిత్రంలో ఏఎన్నార్ నటన అద్వితీయం. క్యాన్సర్ వ్యాధిగ్రస్తుడిగా, ప్రేమికుడిగా ఆయన పండించిన హాస్యం, చూపించిన వేదన ప్రేక్షకుల గుండెలను పిండేసింది. శ్రీదేవి, జయసుధల నటన ఈ సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చింది. ముఖ్యందా చక్రవర్తి స్వరపరిచిన పాటలు నేటికీ ఎవర్‌గ్రీన్. “దేవీ.. శ్రీదేవీ..”, “నా కళ్లు చెబుతున్నాయి..”, “వందనం.. అభివందనం..” వంటి పాటలు తెలుగు వారి ఇళ్లలో ఇప్పటికీ మారుమోగుతూనే ఉంటాయి. ఇక “లక్షల మంది హృదయాల్లో ఏఎన్నార్ ఎప్పటికీ జీవించే ఉంటారు. ప్రేమాభిషేకం లాంటి చిత్రాలు మళ్లీ మళ్లీ రావు” అంటూ అన్నపూర్ణ స్టూడియోస్ షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ప్రేమకు నిర్వచనం…
త్యాగానికి ప్రతీక…
సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన ప్రేమాభిషేకం ❤️🔥Celebrating 4️⃣5️⃣ glorious years of #Premabhishekam, a historic blockbuster whose records, emotions and impact remain untouched even today✨
A timeless legacy of the legendary #ANR garu that… pic.twitter.com/Ifcorr71DG
— Annapurna Studios (@AnnapurnaStdios) February 18, 2026
తాజావార్తలు
-
TGSPDCL : విద్యుత్ డిమాండ్‌లో కొత్త రికార్డు.. 12,044 మెగావాట్లు.!
-
Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్‌పై కనిమొళి సెటైర్లు.!
-
UP Elections: ‘‘అభ్యర్థి పేరు చెప్పండి.. సీటు తీసుకోండి’’.. కాంగ్రెస్‌కు ఎస్పీ కొత్త కండిషన్
-
Telangana Agriculture : పప్పుధాన్యాల సాగులో తెలంగాణకు రెండో స్థానం.. కేంద్రానికి కీలక ప్రతిపాదనలు
-
Shree Charani: ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోతున్న తెలుగు బిడ్డ.. రికార్డులను తిరగరాస్తున్న శ్రీచరణి..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!