World Malaria Report: మళ్లీ మలేరియా.. భారత్ సహా 4 ఆఫ్రికా దేశాల్లోనే అధికం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
World Malaria Report: కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా మలేరియా నివారణ చర్యలకు ఆటంకం కలిగిందని.. దీంతో మలేరియా కేసులు, మరణాలు పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. ‘వరల్డ్ మలేరియా రిపోర్ట్-2022’ను ప్రపంచ ఆరోగ్య సంస్థ శనివారం విడుదల చేసింది. మొత్తం 11 దేశాల్లో మలేరియా కేసులు ఎక్కువగా ఉన్నాయని.. భారత్‌తో పాటు కాంగో, ఘనా, నైగర్, టాంజానియాల్లో తీవ్రత అధికంగా ఉందని వివరించింది. అయితే, ఈ దేశాల్లో మలేరియా మరణాలు తగ్గినట్లు వెల్లడించింది. అంతేగాక మరణాల్లో 96 శాతం 29 దేశాల నుంచే సంభవిస్తున్నట్లు రిపోర్ట్‌లో నివేదించింది.
2020లో మలేరియా మృతుల సంఖ్య 6.25 లక్షలు కాగా, 2021 నాటికి 6.19 లక్షలకు తగ్గాయని వెల్లడించింది. కొవిడ్‌కు ముందు.. 2019లో మృతుల సంఖ్య 5.68 లక్షలుగా ఉన్నట్లు పేర్కొంది. 2019తో పోల్చితే 2020లో మరణాలు పదిశాతం పెరిగాయని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. 2021లో మొత్తం 24,70 కోట్ల మలేరియా కేసులు నమోదవ్వగా.. 2020లో వాటి సంఖ్య 24.50 కోట్లని తెలిపింది. 2019లో ఆ సంఖ్య 23.20 కోట్లేనని పేర్కొంది. ఆగ్నేయాసియా ప్రాంతంలో నమోదయ్యే మొత్తం కేసుల్లో 79 శాతం, మరణాల్లో 83 శాతం భారత్ నుంచే వస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. మలేరియా అంతానికి ప్రస్తుతం దేశాలు తీసుకుంటున్న చర్యలు సమర్థంగా లేవని ఆందోళన వ్యక్తం చేసింది.
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
Vande Bharat Express: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రతి ఏడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ మలేరియా నియంత్రణ, నిర్మూలనలో తాజా పోకడలపై సమాచారాన్ని అందిస్తుంది. నివేదిక ప్రపంచ లక్ష్యాల వైపు పురోగతిని హైలైట్ చేస్తుంది. వ్యాధిని అరికట్టడానికి, తొలగించడానికి అవకాశాలు, సవాళ్లను వివరిస్తుంది.ఈ సంవత్సరం నివేదికలో 3 కొత్త విభాగాలు ఉన్నాయి. 1) 2021, 2022లో ప్రారంభించబడిన ప్రపంచ, ప్రాంతీయ కార్యక్రమాలు; (2) గ్లోబల్ మలేరియా నిఘా. నిఘా వ్యవస్థల అంచనాలపై దేశ-స్థాయి కేస్ స్టడీస్ (3) పరిశోధన, అభివృద్ధి. నివేదికలో మలేరియా నియంత్రణకు వచ్చే ముప్పులపై విస్తరించిన విభాగాన్ని కూడా కలిగి ఉంది,
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?