పాకిస్థాన్ సరిహద్దులకు దగ్గరగా ఉన్న పంజాబ్‌లోని సరిహద్దు జిల్లా తరన్ తరణ్‌లోని పోలీస్ స్టేషన్‌పై ఈ తెల్లవారుజామున రాకెట్ లాంచర్ తరహా ఆయుధంతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తేలికపాటి రాకెట్‌తో ఉగ్రవాదులు దాడి చేశారని వెల్లడించారు.
యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) రూపొందించిన కొత్త ముసాయిదా నిబంధనల ప్రకారం విద్యార్థులు మూడేళ్లకు బదులుగా నాలుగు సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాతే అండర్ గ్రాడ్యుయేట్ 'ఆనర్స్' డిగ్రీని పొందగలరు. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా దేశవ్యాప్తంగా నాలుగేళ్ల డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టాలని యూజీసీ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2023 సెప్టెంబర్‌లో న్యూఢిల్లీలో జరిగే G20 సదస్సులో పాల్గొనే అవకాశం ఉందని రష్యాకు చెందిన జీ20 షెర్పా స్వెత్లానా లుకాష్ తెలిపారు.
పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల కోసం లింగమార్పిడి చేసుకున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చని, ఫిబ్రవరి 2023 నాటికి వారి ఫిజికల్ టెస్ట్‌ల ప్రమాణాలను రూపొందిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం బాంబే హైకోర్టుకు తెలిపింది.
మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలోని మాండవి గ్రామంలో డిసెంబర్ 6న 55 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయిన ఎనిమిదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆడుకుంటున్న ఆరేళ్ల బాలుడు ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం రాత్రి వెలుగుచూసింది.
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం విద్యార్థుల బృందం ప్రయాణిస్తున్న కారు మరో రెండు వాహనాలను ఢీకొనడంతో కనీసం ఐదుగురు కళాశాల విద్యార్థులు మరణించగా.. మరో నలుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
మాండూస్ తుఫాన్ తీరం దాటిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం తెలిపింది. రాత్రి 1:30 గంటలకు పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తుఫాన్ తీరం దాటింది.
గురువారం ప్రకటించిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ధనిరామ్ షాండిల్ హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. తన సమీప బీజేపీ ప్రత్యర్థి, అల్లుడు రాజేష్ కశ్యప్‌ను ఓడించారు.