Ind vs Ban: ఛటోగ్రామ్‌లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో జరుగుతున్న మొదటి టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. టీమిండియా విజయం దిశగా పయనిస్తోంది. 513 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన బంగ్లాదేశ్ 272 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమి ముంగిట నిలిచింది. రేపు చివరి రోజు బంగ్లాదేశ్ విజయానికి 241 పరుగులు అవసరం కాగా.. భారత్ 4 వికెట్లు తీస్తే గెలుపు ఖాయమవుతుంది. 4వ రోజు ఆట ముగిసే సమయానికి షకీబ్ అల్ హసన్ (40*), మెహిదీ హసన్ మిరాజ్(9*) క్రీజులో ఉన్నారు. ఆతిథ్య జట్టు నజ్ముల్ హొస్సేన్ శాంటో, యాసిర్ అలీ, లిట్టన్ దాస్, జకీర్ హసన్, ముష్ఫికర్ రహీమ్, నూరుల్ హసన్‌ల వికెట్లను కోల్పోయింది. అక్షర్ పటేల్ మూడు వికెట్లు తీయగా, ఉమేష్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీశారు.
FIFA World Cup Final: తుదిపోరుకు ముందే డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్‌కు భారీ షాక్
513 పరుగుల ఛేదనలో ఆతిథ్య జట్టు అద్భుతంగా ఆరంభించినా భారత బౌలర్లు పుంజుకోవడంతో రెండో ఇన్నింగ్స్‌లోనూ బంగ్లా తడబాటుకు గురైంది. శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా సెంచరీలతో భారత్ తన రెండో ఇన్నింగ్స్‌ను 2 వికెట్ల నష్టానికి 258 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అంతకుముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత భారత్ 404 పరుగులు చేసింది. తర్వాత బంగ్లాదేశ్‌ను 150 పరుగులకు ఆలౌట్ చేసి, మొదటి ఇన్నింగ్స్‌లో 254 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించారు. కుల్దీప్ యాదవ్ మొదటి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు సాధించాడు.