Infosys Co-Founder: గరీభీ హఠావో అనే నినాదాలతో పేదరికం దూరం కాదని.. నిరంతర శ్రమ, ఆలోచనలు, ఆవిష్కరణలు దేశాన్ని ముందుకు తీసుకెళ్తాయని ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి అన్నారు. ఆంధ్రా యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తన బాల్యంలో తన సెలవులను ఆంధ్రా-కర్ణాటక సరిహద్దుల్లోని సీదలాగుట్టలో గడిపానని గుర్తు చేసుకున్నారు. తెలుగు మాట్లాడలేను కానీ బాగా అర్థం చేసుకోగలనన్నారు. మాయాబజార్, దేవదాస్, పెళ్లి చేసి చూడు వంటి సినిమాలను వీధి తెరపై చూసిన అనుభవం ఉందన్నారు.
Indian Economy: రెండేళ్లలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్..
45శాతం మంది రైతులు ఉన్న ఇండియా జీడీపీలో వాళ్ల భాగస్వామ్యం తక్కువగా ఉందన్నారు. విదేశాల్లో ఉన్న భారతీయులు దేశానికి బ్రాండ్ అంబాసిడర్‌లుగా వ్యవహరించాలన్నారు. ఇప్పటికే యూఎస్, యూకేల్లో భారతీయులు ఆ పనిని సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారన్నారు. అన్ని రంగాల్లోనూ భారత్ విలువైన దేశంగా ఎదగాలన్నారు. ఒకప్పుడు అవమానించబడ్డ స్థాయి నుంచి జీ 20 సమావేశాలకు ప్రాతినిధ్యం వహించే వరకు ఎదిగామని గర్వంగా చెప్పారు. యూనివర్సిటీలు విజ్ఞాన కేంద్రాలుగా మిగిలిపోకుండా చోదక శక్తిగా ఎదగాలన్నారు.