18 Pages Trailer: అందంగా, ఆసక్తికరంగా ’18 పేజెస్’ చిత్రం ట్రైలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
18 Pages Trailer: వరుస సినిమాలను నిర్మిస్తున్న ‘జీఏ 2 పిక్చర్స్’, ,సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీ ’18 పేజెస్’. ‘కార్తికేయ 2’ వంటి పాన్ ఇండియా హిట్ మూవీ తర్వాత నిఖిల్, అనుపమ పరమేశ్వరన్‌ల కాంబినేషన్‌లో రాబోతున్న మరో చిత్రం ఇది కావడం గమనార్హం. ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తుండగా.. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. నిఖిల్, అనుపమ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. ఆయన శిష్యుడు ‘కుమారి 21ఎఫ్’ చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు, ఈ చిత్రంలోని పాటలు “నన్నయ్య రాసిన”, “టైం ఇవ్వు పిల్ల” అనే పాటలతో పాటు రీసెంట్‌గా విడుదలైన ‘ఏడు రంగుల వాన’ అనే పాటకు కూడా అనూహ్య స్పందన లభించింది. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై రోజురోజుకు ఆసక్తిని పెంచుతోంది. ఇదిలా ఉండగా.. ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు ’18 పేజెస్’ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
Also Read
- Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
Anushka Shetty: యంగ్ కుర్రాడితో ప్రేమలో పడిన అనుష్క.. వివరాలివే
ఈ ట్రైలర్ ఓ కొత్త అనుభూతిని క్రియేట్ చేస్తోంది. అద్భుతమైన విజువల్స్ పాటు నిఖిల్, అనుపమల మధ్య కెమిస్ట్రీని అందంగా చూపించారు. కేవలం ఇద్దరి ప్రేమికుల మధ్య జరిగే ఫీలింగ్స్ మాత్రమే కాకుండా.. ఈ చిత్రంలోని ఆసక్తికరమైన సంఘటనలను ట్రైలర్‌లో చూపించారు. ‘ప్రేమించడానికి రీజన్ ఉండకూడదు, ఎందుకు ప్రేమిస్తున్నం అంటే ఆన్సర్ ఉండకూడదు’ లాంటి డైలాగ్స్ ఈ ట్రైలర్‌లో ఆకట్టుకుంటున్నాయి. పాన్ ఇండియా దర్శకుడి నుంచి మరో అందమైన అద్భుతమైన ప్రేమకథ ఇది అనేలా ఉంది ఈ చిత్ర ట్రైలర్. సస్పెన్స్‌ను కూడా మెయింటైన్ చేస్తూ ట్రైలర్‌ను కట్ చేశారు మేకర్స్
’18 పేజెస్’ చిత్రంలోని ఇప్పటికే రిలీజైన పాటలన్నింటికి మంచి స్పందన లభిస్తుండగా.. ఇప్పుడు రిలీజైన ట్రైలర్ ఈ సినిమాపై ఇంకా అంచనాలను పెంచుతోంది. ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతం అందించారు. డిసెంబర్ 23న క్రిస్టమస్ కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ’18 పేజెస్’ ట్రైలర్ జనాలకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తోంది.. మరి సినిమా ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తుంది అనేది వేచిచూడాల్సిందే.
తాజావార్తలు
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
-
Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా…!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!