ఢిల్లీ సహా ఉత్తరాదిని చలి వణికిస్తోంది. ఢిల్లీలో ఈ సీజన్‌లోనే అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. గురువారం ఉదయం కనిష్ట ఉష్ణోగ్రతలు 2.8 డిగ్రీలకు పడిపోయాయి. ఢిల్లీలోని లోధి రోడ్‌లో 2.8 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది.
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ భారీ సంఖ్యలో ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్ధమవుతోంది. అమెజాన్ కంపెనీ తన కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లతో సహా దాదాపు 18 వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది.
నిరుద్యోగంపై కేంద్రంలో, మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వాలను విమర్శిస్తూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.దేశంలో నిరుద్యోగం కారణంగా పెళ్లి వయసులో ఉన్న యువకులకు వధువులు దొరకడం లేదని ఆయన బుధవారం అన్నారు.
ఢిల్లీలోని కాంజావాలాలో 20 ఏళ్ల యువతిని కారు 13 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లిన ఘటనను మరువక ముందే ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం జరిగింది. దేశవ్యాప్తంగా ఢిల్లీ ఘటనపై చర్చ జరుగుతుండగానే యూపీలోని బాండాలో అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విమానం అత్యవసర పరిస్థితుల్లో అస్సాంలో ల్యాండ్ అయింది. అగర్తలాకు వెళ్తుండగా వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల గౌహతిలోని లోక్‌ప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
మహారాష్ట్రలో సెల్ఫీ మోజు ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొంది. ఓ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. మహారాష్ట్రలోని వరంధా ఘాట్ రోడ్డులో కోతులతో సెల్ఫీ తీసుకుంటూ 500 అడుగుల లోతైన లోయలో పడి 39 ఏళ్ల వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి వారి భవిష్యత్‌ను తీర్చిదిద్దాల్సిన గురువే బుద్ధితక్కువ పనులు చేస్తూ కీచకుడిలా మారాడు. మైనర్ విద్యార్థుల అసభ్యకరమైన వీడియోలను క్యాప్చర్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నందుకు నవాడాకు చెందిన మదర్సా ఉపాధ్యాయుడిని బీహార్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.
హరిత తెలంగాణ దిశగా ఎంపీ సంతోశ్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే ఈ కార్యక్రమంలో స్టార్ హీరోలతో పాటు రాజకీయ నాయకులు పాల్గొనగా తాజాగా పాన్ ఇండియా నటుడు సముద్ర ఖని పాలు పంచుకున్నారు.
ఢిల్లీలో స్కూటీపై వెళ్తున్న యువతిని కారుతో ఢీకొట్టి 13 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటనలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. అంజలి పోస్టుమార్టం రిపోర్టులో షాకింగ్ విషయాలు బయటికొచ్చాయి.