Madrasa teacher: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి వారి భవిష్యత్‌ను తీర్చిదిద్దాల్సిన గురువే బుద్ధితక్కువ పనులు చేస్తూ కీచకుడిలా మారాడు. మైనర్ విద్యార్థుల అసభ్యకరమైన వీడియోలను క్యాప్చర్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నందుకు నవాడాకు చెందిన మదర్సా ఉపాధ్యాయుడిని బీహార్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఉపాధ్యాయుడిపై మదర్సా విద్యార్థిని కవాకోల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఉపాధ్యాయుడు బాలికను అసభ్యకరమైన వీడియోలు చేస్తూ బ్లాక్‌మెయిల్ చేసేవాడని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
Bangalore Airport: తనిఖీ పేరుతో దుస్తులు విప్పించారు.. కట్ చేస్తే ఊహించని ట్విస్ట్
పోలీసులు సత్వర చర్యలు చేపట్టి గత మూడేళ్లుగా మదర్సాలో బోధిస్తున్న షాహదత్ హుస్సేన్‌ను అదుపులోకి తీసుకున్నారు. షాహదత్ జాముయి జిల్లాలోని ఖైరా పోలీస్ స్టేషన్ పరిధిలోని గర్హి గ్రామంలో నివాసి. పోలీసులు షాహదత్ హుస్సేన్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మదర్సా టీచర్ మైనర్ విద్యార్థులపై అశ్లీల వీడియోలు చిత్రీకరించి బ్లాక్‌మెయిల్ చేసేవాడని కవాకోల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేశామని, పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని పోలీసు అధికారి మహేశ్ తెలిపారు. విచారణ జరుగుతోందని వెల్లడించారు.