Amazon Layoff: ఆర్థిక మందగమనం, ఆర్థిక మాంద్యం పరిస్థితులు, ద్రవ్యోల్భణం భయాల మధ్య పలు టెక్ కంపెనీలు వరసగా తమ ఉద్యోగులను తీసేస్తున్నాయి. ట్విట్టర్‌లో మొదలైన ఈ తొలగింపులు వరసగా కొనసాగుతున్నాయి. మైక్రోసాప్ట్, గూగుల్, అమెజాన్ ఇలా ప్రముఖ టెక్ దిగ్గజాలు అన్నీ కూడా తమ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించాయి. లాభాలు తగ్గడంతో ఖర్చులు తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి.
ఇదిలా ఉంటే ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ భారీ సంఖ్యలో ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్ధమవుతోంది. అమెజాన్ కంపెనీ తన కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లతో సహా దాదాపు 18 వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. కొన్నేళ్లుగా అధిక సంఖ్యలో నియామకాలు జరుపుతుండటంతో పాటు ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి కారణంగా తన శ్రామిక శక్తి నుంచి 18,000 కంటే ఎక్కువ ఉద్యోగాలను తొలగించనున్నట్లు అమెజాన్ బుధవారం ప్రకటించింది.
“తాము నవంబర్‌లో ప్రకటించిన దానికంటే అధికంగా సుమారు 18,000 ఉద్యోగులను తొలగించాలని భావిస్తున్నాం.” అని సీఈవో ఆండీ జాస్సీ తన సిబ్బందికి ఒక ప్రకటనలో తెలిపారు. గతేడాది నవంబర్‌లో కంపెనీ 10,000 మంది ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది. అయితే ఈ సంఖ్య 10 నుంచి 20 వేల వరకు ఉంటుందని కంపెనీ వర్గాలు గతంలోనే వెల్లడించాయి. కొన్ని తొలగింపులు యూరప్‌లో ఉంటాయని, జనవరి 18 నుంచి ప్రభావితమైన కార్మికులకు తెలియజేయబడుతుందని జాస్సీ చెప్పారు. తమ సహచరులలో ఒకరు ఈ సమాచారాన్ని బాహ్యంగా లీక్ చేసినందున అకస్మాత్తుగా ప్రకటన చేయడం జరిగిందని ఆయన చెప్పారు.
Selfie With Monkeys: కోతులతో సెల్ఫీ తీసుకుంటూ 500 అడుగుల లోయలో..
ప్రస్తుతం అమెజాన్‌లో ప్రపంచవ్యాప్తంగా 1.54 మిలియన్ల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. 2020, 2022 ప్రారంభంలో అమెజాన్ అధికంగా నియామకాలు చేపట్టింది. ఆ సమయంలో చాలా మందిని ఉద్యోగాల్లో నియమించుకున్నారు. ఆర్థిక మందగమనం, ఆర్థిక మాంద్యం పరిస్థితులు, ద్రవ్యోల్భణం భయాల మధ్య తన ఖర్చులను తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఉద్యోగాలపై కోతలు విధించాలని నిర్ణయం తీసుకుంది.