Anti-Govt Protests: దక్షిణ పెరూలో పోలీసులతో జరిగిన ఘర్షణల్లో 17మంది పౌరులు చనిపోయారు. ముందస్తు ఎన్నికలు, జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ అధ్యక్షుడు పెడ్రో కాస్టిల్లోని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పటివరకు జరిగిన నిరసనల్లో 17 మంది మృతి చెందారని ఆ దేశ మానవ హక్కుల కార్యాలయం సోమవారం వెల్లడించింది. దక్షిణ పెరూలోని పునో ప్రాంతంలోని టిటికాకా సరస్సు ఒడ్డున ఉన్న జూలియాకా అనే నగరంలో ఈ ఘర్షణలు సంభవించాయి. 68 మంది గాయపడ్డారని పునో ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి హెన్రీ రెబాజా తెలిపారు. మృతుల్లో కనీసం ఇద్దరు యువకులు కూడా ఉన్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది. కొన్ని మృతదేహాలకు బుల్లెట్ గాయాలు ఉన్నాయని పునో ప్రాంతీయ ఆరోగ్య డైరెక్టర్ ఇస్మాయిల్ కార్నెజో వెల్లడించారు. తాజా మరణాలతో ప్రభుత్వ వ్యతిరేక ఘర్షణలో చోటుచేసుకున్న మరణాల సంఖ్య 39కి చేరింది.
Joshimath: జోషిమఠ్ నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి.. 16న సుప్రీం విచారణ
డిసెంబర్‌లో కాస్టిలోను పదవి నుంచి అరెస్ట్ చేసిన తర్వాత నాటకీయ పరిణామాలతో దేశంలో నిరసనలు ప్రారంభమయ్యాయి. తాజాగా మరోసారి ఉద్రిక్తం కావడంతో ఘర్షణ వాతావరణం తలెత్తింది. అయితే తాను గద్దె నుంచి అవకాశం లేదని నూతన ప్రధాని డినా బొలూవార్టె అన్నారు. నిరసనకారుల ప్రధాన డిమాండ్లను తీర్చే అవకాశం లేదని చెప్పారు. అయితే ఎన్నికలను ముందుకు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు పెరూలో పరిస్థితిని అంచనా వేసేందుకు ఇంటర్ అమెరికన్ కమిషన్ బుధవారం నుంచి మూడు రోజుల పాటు పర్యటించనుంది. పరిస్థితిని అంచనా వేయడానికి లిమా, ఇతర నగరాలను సందర్శిస్తానని తెలిపింది.