Mp Joginapally Santosh Kumar Congratulates Banoth vennela: జనవరి 19 నుండి దక్షిణాఫ్రికాలోని కిలిమంజారో పర్వత అధిరోహణ చేయనున్న సందర్భంగా మంగళవారం ప్రగతి భవన్ లో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌ను గిరిజన విద్యార్థిని బానోత్ వెన్నెల మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా భానోతు వెన్నెల మాట్లాడుతూ.. తమది కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమవారంపేట గ్రామమని, గిరిజన కుటుంబం అని తనకు చిన్నతనం నుంచి పర్వతారోహణ చేయడం ఇష్టమని, అందులో భాగంగా ఈనెల 19 నుంచి దక్షిణాఫ్రికాలోని కిలిమంజారో (5895) మీటర్ల పర్వతాన్ని అధిరోహించడం కోసం వెళ్తున్నానని ఆమె తెలిపారు. భవిష్యత్తులో ప్రపంచంలోనే అతి పెద్దదైన మౌంట్ ఎవరెస్ట్ (8840) పర్వతాన్ని కూడా అధిరోహిస్తానని తెలిపారు.
Read Also: Bandi Sanjay: సోమేశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలి
ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ వెన్నెలను అభినందిస్తూ.. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వెన్నెల పట్టుదలతో ఈ కార్యక్రమం చేపడుతున్న సందర్భంగా తన వంతు సహాయంగా 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. భవిష్యత్తులో కూడా అన్ని రకాలుగా అండగా ఉంటానని, తెలంగాణ రాష్ట్రానికి, భారతదేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ కూడా ఉన్నారు.
