Green India Challenge: కొత్త శిఖరాలకు చేరుకుంటున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Green India Challenge: ప్రకృతి, పర్యావరణం బాగుండాలి, మానవాళికి స్వచ్చమైన ప్రాణవాయువు అందాలి అనే సంకల్పంతో ప్రారంభమైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కొత్త శిఖరాలను చేరుకుంటోంది. దేశ విదేశాల్లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జెండా ఎగురుతోంది. పర్యావరణ మార్పులను ఎదుర్కోవాలి, ఆకు పచ్చని చెట్లను పెంచాలనే ప్రచారాన్ని విసృతంగా అన్ని వర్గాలకు చేరువ చేస్తోంది గ్రీన్ ఇండియా ఛాలెంజ్. తాజాగా అంటార్కిటికాలో ఎత్తైన పర్వతంపైనా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పతాకం ఎగిరింది. ఏడు ఖండాల్లో ఏడు శిఖరాలను అధిరోహించే సవాల్‌ను స్వీకరించిన భూపతిరాజు అన్మిష్ వర్మ విజయవంతంగా పూర్తి చేశాడు. భూగోళం చిట్టచివరలో, మంచు ఖండం అంటార్కిటికాలో ఎత్తైన పర్వతం మౌంట్ విన్షన్‌ను అధిరోహించిన అన్మిష్ వర్మ, అక్కడ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జెండాను ప్రదర్శించాడు.
గ్లోబల్ వార్మింగ్ రూపంలో ప్రపంచానికి పర్యావరణ ముప్పు పొంచి ఉందని, దానికి ఎదుర్కొనేందుకు విరివిగా మొక్కలు నాటాలనే సంకల్పంతో రాజ్యసభ ఎం.పీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గొప్ప కార్యక్రమం అని అన్మిష్ వర్మ అన్నారు. ఈ ఆశయాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలి, అందరిలో పర్యావరణ స్పృహ కల్పించాలనే లక్ష్యంతో ఎత్తైన పర్వతాలను అధిరోహించి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పతాకాన్ని ప్రదర్శిస్తున్నట్లు వెల్లడించారు. ఎవరెస్ట్‌తో సహా ఏడు ఖండాల్లో ఏడు శిఖరాల అధిరోహణ విజయవంతంగా పూర్తి చేసినట్లు అన్మిష్ వర్మ తెలిపారు.
Also Read
- 5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
Indrakaran Reddy: నాందేడ్ గురుద్వార్ ను దర్శించుకున్న ఇంద్రకరణ్ రెడ్డి
భూగోళం దక్షిణ ధృవంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ప్రదర్శించటం గర్వంగా ఉందని, ఈ అవకాశం కల్పించిన ఎంపీ సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కాలుష్యాన్ని తగ్గించటం, స్వచ్చమైన పర్యావరణ దిశగా కృషి చేయటం విధిగా అందరూ పాటించాలని కోరారు.
తాజావార్తలు
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..