Tamilnadu: తమిళనాడులో పెను ప్రమాదం తప్పింది. బస్సు నుంచి ప్రయాణికులు ఒక్కసారిగా బయటకు పరుగులు పెట్టారు. అంటుకున్న మంటలు కాసేపట్లోనే పెద్దగా వ్యాపించాయి. సేలం జిల్లా మెట్టూరు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కోయంబత్తూరు నుంచి 44 ప్రయాణీకులతో బెంగళూరుకు బయలుదేరగా.. మెట్టూరు వద్ద మంటలు చోటుచేసుకున్నాయి.
Water Contamination : హిమాచల్ ప్రదేశ్లో కలుషిత నీరు తాగి 535మందికి అస్వస్థత
అప్రమత్తమైన బస్సు డ్రైవర్ రాజన్.. బస్సులోని వారందరినీ క్షేమంగా కిందకు దిగేలా చేశారు. ఆయన అప్రమత్తత కారణంగా 44 మంది ప్రాణాలు నిలిచాయి. బస్సులో వారందరు ఒకే సారి బయటకు పరుగులు తీయడంతో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ముగ్గురు మహిళలతో సహా 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మంటలు చెలరేగి ఆ బస్సు అగ్నికి ఆహుతైంది. ప్రయాణికుల ప్రాణాలను రక్షించిన డ్రైవర్ రాజన్‌ను అందరూ అభినందిస్తున్నారు.